అసలే అప్పులతో నానా ఇబ్బందులు పడుతున్న ఏపీ సర్కార్ కి పోలవరం గుదిబండగా మారుతుందా అన్న చర్చ ఇపుడు బయల్దేరింది పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. తాము ఇంతే ఇస్తామని కూడా క్లారిటీగా చెప్పేసింది. ఆ తరువాత బంతి జగన్ కోర్టులోకే వచ్చిపడింది. పోలవరం జగన్ కి రెండు విధాలుగా ప్రతిష్టాత్మకమైనది. ఒకటి ఆయన తండ్రి వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ ఇది.  రెండవది 151 సీట్లతో జనం గెలిపించి అధికారం ఇచ్చారు. వారికి న్యాయం చేయాలి.
అందువల్ల ఏ విధంగా చూసుకున్నా పోలవరం తన టెర్మ్ లో జగన్ పూర్తి చేసి చూపించాలి. లేకపోతే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు.

దీని మీద సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే కేంద్రాన్ని ఒప్పిస్తామని అంటున్నారు. ఏదో విధంగా పోలవరం గురించి చెప్పాల్సింది చెప్పి కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకుంటామని, అవసరం అయిన నిధులు రప్పిస్తామని కూడా అంటున్నారు. అయితే కేంద్రంలో ఉన్నది మోడీ సర్కార్. ఇప్పటిదాకా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుంచి వెనక్కి రావడం అన్నది మోడీ చరిత్రలోలేదు. పైగా ఏపీని ప్రత్యేకంగా కేంద్రం ఎపుడూ చూడడంలేదు. అలా కనుక చూసి ఉంటే ఈపాటికి ప్రత్యేక హోదా పరుగులు పెడుతూ వచ్చేసేది.

కానీ ఇపుడు అసలైన సమస్య పోలవరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తి కాకపోతే  గతంలో టీడీపీ ఏ తప్పులు చేసింది. మరెవరు ఏం చేశారు అన్న ప్రశ్న లేకుండా అంతా జగన్ సర్కార్నే నిందిస్తారు. కానీ ఇపుడు జగన్ ముందు రెండే మార్గాలు అని కూడా అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం విషయంలో పోరాడి సాధించడం. లేదా సొంతంగా అప్పులు చేసైనా ఆ అ పని  పూర్తి చేయడం. మరి జగన్ సర్కార్ రెండవ విధానం ఎంచుకుంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. మంత్రి బొత్స మాట్లాడుతూ పోలవరం విషయంలో తాము అన్ని రకాలైన వనరులను వాడుకుంటామని చెప్పారు. మరి చూడాలి జగన్ ఏ రకమైన సంచలన నిర్ణయం తీసుకుంటారో.





మరింత సమాచారం తెలుసుకోండి: