దుబ్బాక  ఉప ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర విమర్శలు చేసారు. కాంగ్రెస్, బిజెపి మధ్య కూడా మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ముఖ్యంగా  కేంద్ర హోం శాఖా మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేసే విషయంలో దూకుడుగా ఉన్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యల పై స్పందించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  కీలక వ్యాఖ్యలు చేసారు. దుబ్బాకలో కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది  అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి చేసిన డెవలప్ మెంటే మమ్మల్ని గెలిపిస్తుంది.. అని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గమనించాలి అని ఆయన పేర్కొన్నారు. దుబ్బాకలో ఓటు అడిగే హక్కు మాకే ఉంది  అని ఆయన పేర్కొన్నారు. దుబ్బాకలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు , మంత్రి హరీష్ రావులు అన్నదమ్ములు  అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ కు రఘునందన్ రావు బినామీ ఆ విషయం తెలియక కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై మాట్లాడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.

సిఎం కేసీఆర్, హరీష్ రావులు దుబ్బాకకు చేసిందేమీ లేదు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వాళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు  అని ఉత్తమ మండిపడ్డారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి కరోనా సోకడం వలన ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు  అని ఆయన పేర్కొన్నారు. విజయశాంతికి తాను తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని మీడియాలో ఇష్టమొచ్చినట్లు పిచ్చి రాతలు రాస్తున్నారు అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. నేను ప్రతి రోజూ విజయశాంతితో మాట్లాడుతున్నాను  అని ఆయన అన్నారు. దుబ్బాకలో గెలిచేది మేమే అని ధీమా వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: