ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అధికార పార్టీ నేతలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేసారు.  వరదల నేపధ్యంలో ఇప్పుడు  నారా లోకేష్  అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఆయనను మంత్రి అనీల్ కుమార్ యాదవ్ టార్గెట్ చేసారు. పప్పు మహారాజ్ చేసే ఆరోపణలకి సమాధానం చెప్పడమే మా ఖర్మ అని ఆయన విమర్శలు చేసారు. అరేయ్ పప్పు బాయ్ మంగళగిరిలో నీకు అదే గతి అంటూ ఆయన విమర్శలు చేసారు. గోచి కూడా మిగలదు అని ఆయన అన్నారు.

ఎంత మంది కట్టకట్టుకుని కుట్రలు పన్నినా జగన్ 151 సీట్లతో సీఎం అయ్యారు అని ఆయన వ్యాఖ్యానించారు.  మర్యాదగా మాట్లాడితే మార్యాదగా మాట్లాడుతాం అని సూచించారు.  నీ లాగా, మీ బాబు లాగా మీ తాత పార్టీ లాక్కొని జగన్ సీఎం కాలేదు అని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే రైతుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించిన నేత జగన్ అని ఆయన కొనియాడారు. ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకో అని ఆయన హితవు పలికారు. మీ పార్టీ నేతలే నిన్ను పరిస్థితుల్లో లేరు అని ఆయన ఎద్దేవా చేసారు.

పోలవరం పనులు డెబ్బై శాతం పూర్తైతే మీసాలు తీసేస్తానన్న నేత ఎక్కడా అని మీసాలు లేని లేని నేత మాట్లాడుతున్నాడు అని ఆయన ప్రశ్నించారు. లక్ష కుటుంబాలున్నాయి అని అన్నారు. “వారందరికీ ఇళ్లు నిర్మించాలి. యాభై శాతమే పూర్తయ్యాయంటే వినరు. ఏ కమీషన్ల కోసం క్యాబినేట్ నోట్ పెట్టారో చెప్పండి. పోలవరం పూర్తిచేసి తీరుతాం. శాన్ ఫోర్డ్ వీరుడు, పప్పు వీరుడు. ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టో జగన్ క్యాబినేట్ లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యా. జగన్ పాదం వల్లే రెండేళ్లుగా డ్యాంలన్నీ నిండుతున్నాయి. మీతాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో ఓడిపోయావ్.” అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: