తెలంగాణలో విద్యా సంస్థలు ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. విద్యాశాఖలో దీనిపై ఎలాంటి కదలిక కూడా లేదు. దీపావళి వరకు తెరుచుకోకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఇందుకు సంబంధించి ఇటీవల ఎలాంటి సమావేశాలు జరగిందీ లేదు. కరోన కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. విద్యా సంస్థలు ప్రారంభించాలనుకుంటే సంక్షేమ, గురుకులాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఆయా శాఖల మంత్రులు కోరారు.  

ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం దీపావళి ముగిశాకే విద్యాసంస్థలు ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అప్పటి వరకు ఆన్ లైన్, డిజిటల్ బోధనే కొనసాగనుంది. నవంబర్ మొదటి వారంలో యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం డిగ్రీ, పీజీ తరగతులు ప్రారంభమవుతాయన్న ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే ఇంటర్, హై స్కూల్, ప్రైమరీ తరగతులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది.  క్లాసెస్ నిర్వహణలవో ఎలాంటి దుష్పరిణామాలు ఉత్పన్నం కాకపోతే.... విడుతల వారీగా అన్ని స్థాయిల్లో విద్యా సంస్థలు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు విద్యాశాఖ చెబుతోంది.

కోవిడ్ విషయంలో రాబోయే రోజులు చాలా కీలకమని,  సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. కొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తొందరపడి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మొత్తానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ ఎత్తివేసిన దగ్గర నుంచి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతున్న ఆ మహమ్మారి ఎందరినో ఆస్పత్రి పాలు చేసింది. ప్రాణాలను హరించేసింది కూడా. అయితే ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో విద్యాసంస్థలు తెరవడంపై తెలంగాణ రాష్ట్రం తర్జనభర్జనలు పడుతోంది.ఒక వేళ విద్యాసంస్థలు తెరిస్తే నష్టం విద్యార్థులపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందోనన్న ఆలోచనలో పడిపోయింది.  





మరింత సమాచారం తెలుసుకోండి: