ఇటీవల కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరంలో ఎంతటి బీభత్సం సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాగ్యనగర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా భారీ రేంజ్ లో కురిసిన వర్షంతో హైదరాబాద్ నగరం మొత్తం వరదల్లో మునిగి పోయిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ నగర వాసులు అందరూ నరకం అనుభవించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎక్కడ చూసినా ఏ ప్రాంతానికి వెళ్లినా పూర్తిగా పెద్ద పెద్ద చెరువులను తలపించాయి. దీంతో జనావాసాల్లోకి నీరు వచ్చినట్లు కాదు నీరు ఉన్నచోటే ఇల్లు కట్టుకున్నట్లు గా మారిపోయింది పరిస్థితి.



 జనావాసాల్లోకి నీరు రావడంతో నగరవాసులు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎటు చూసినా పూర్తిగా పెద్ద పెద్ద చెరువులను తలపిస్తూ వరద నీరు కనిపిస్తుండడంతో కనీసం ఇంటి నుంచి కాలు బయట పెట్టాలన్నాకూడా భయపడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఆ తర్వాత అధికారులు వరదల ప్రభావం నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఎన్ని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ దాదాపు కొన్ని రోజుల వరకు ఎన్నో ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే నగర వాసులు అందరూ ఇక్కట్లు  ఎదుర్కోవడమే కాదు ఎన్నో వాహనాలు పూర్తిగా పాడైపోయాయి అని చెప్పాలి





 వేల వాహనాలు వరదల్లో నే రోజుల తరబడి ఉండడంతో కనీసం మళ్ళీ పనికి రాని స్థితికి చేరి పోయాయి. ఇక రోజుల తరబడి వరదనీటిలో మునిగిపోవటం తో కనీసం పని చేయకుండా మారిపోవడంతో వాహనదారులు అయోమయంలో పడిపోయారు. దీంతో వరదల్లో చిక్కుకొని ఎంతో నష్టం వాటిల్లిందని  ఆందోళనలో మునిగిపోయారు. ఇలాంటి వారికి ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ శుభవార్త చెప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదల్లో  పాడైపోయిన బైక్ లకు  ఫ్రీ సర్వీసింగ్ ఆఫర్ ను తమ కస్టమర్లకు ప్రకటించింది. కేవలం స్పేర్ పార్ట్స్ మాత్రమే కొనుక్కోవాలని సర్వీసింగ్ ఫ్రీగానే చేస్తామని.. ఎలాంటి లేబర్ చార్జ్  కూడా తీసుకోము అని స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరంలోని ప్రతి సర్వీస్ సెంటర్ లో  కూడా ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: