ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసింది.  నేర చరిత్ర కు కేరాఫ్ అడ్రస్ అయిన ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం నేరచరిత్ర పూర్తిగా తగ్గిపోతుందన్న విషయం తెలిసిందే. నేరస్తుల పై ఉక్కుపాదం మోపిన యోగి  సర్కార్ క్రమక్రమం గా ఏకంగా నేరస్థుల ను ఎన్కౌంటర్ చేసి చంపింది.  ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయడం లేదు యోగి  సర్కార్. ఇప్పటికే ఎంతోమంది నేరస్తుల పై ఉక్కుపాదం మోపింది.



 అయితే కేవలం నేర చరిత్రను తగ్గించడమే కాదు రాష్ట్రాన్ని అభివృద్ధిలో శరవేగంగా ముందుకు తీసుకుపోవడానికి కూడా ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది  యూపీ సర్కార్. ఓకే సమయంలో  2 వ్యూహాలతో  ముందుకు సాగుతుంది.. ఓవైపు నేరాలపై ఉక్కుపాదం మోపుతూనే.. మరో వైపు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది . ఈ క్రమంలోనే ఇటీవల జపాన్ కంపెనీలను కూడా ఆకర్షించి.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే.



 ఇన్ని  రోజుల పాటు ఉత్తరప్రదేశ్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు సీఎం యోగి. ఇక ఇప్పుడు  600 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ పార్క్ గ్రేటర్ నోయిడా కు సమీపంలో ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ముంబై బేస్డ్ హీరణ్ ధని గ్రూప్ డేటా  సెంటర్ పార్క్ ను సిద్ధం చేస్తుంది. 20 ఎకరాల్లో ఈ డేటా సెంటర్ పార్క్ ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. ఈ డేటా సెంటర్ పార్కు అవసరమైన కరెంటు ఉచితంగా సప్లై చేయడానికి యోగి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ఒకవేళ ఈ డేటా సెంటర్ పార్క్  శరవేగంగా పూర్త అయితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఉండే ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: