చైనా ఎప్పుడు నీచాతి నీచానికి పాల్పడుతు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ముక్కుసూటిగా వెళ్ళడానికి కాకుండా డొంకతిరుగుడు వ్యూహలతో నే వివిధ దేశాల ను దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది చైనా. వివిధ దేశాల రక్షణ రంగంలో ని కీలక సమాచారాన్ని తస్కరించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు చైనాకు చెందిన సైబర్ ఆర్మీ ద్వారా ఇలాంటి కీలక సమాచారాన్ని దొంగలిస్తూ ఉంటే మరికొన్ని సార్లు చైనాకు చెందిన ఎంతో మంది.. ఉద్యోగులుగా వ్యాపారులుగా రక్షణ రంగంలో ప్రొఫెషనల్గా పనిచేస్తూ.. ఇక ఆ తర్వాత వివిధ దేశాలకు చెందిన కీలక సమాచారాన్ని తస్కరించి చైనా కు చేరవేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.



 ఇప్పటివరకు పలుమార్లు రష్యా కు సంబంధించిన రక్షణ రంగం సమాచారాన్ని దొంగిలించి పలు ఆయుధాలను కూడా చైనా తయారు చేసిన విషయం తెలిసిందే ఇక ఇప్పుడు అమెరికా రక్షణ రంగానికి చెందిన పలు కీలక సమాచారం దొంగలించ పడుతుంది అని అమెరికా ప్రభుత్వం గుర్తించింది. కేవలం రక్షణ రంగంలోనే కాదు అన్ని రంగాలలో కూడా ఎంతో  రహస్యంగా ఉంచాల్సిన సమాచారం కాస్తా చైనాకు ఎంతోమంది చేరవేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించి ప్రస్తుత అమెరికా గూడచారి సంస్థలైన సిఏఏ  ఎఫ్డిఐ లు ప్రస్తుతం నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.




 ఈ క్రమంలోనే అమెరికా గూఢచార వ్యవస్థ ఎఫ్ డి ఐ కీలక సమాచారాన్ని సేకరించింది. అమెరికా రక్షణ రంగంలో కొన్ని ఆయుధాలకు సంబంధించిన పార్ట్స్ సంబంధించిన కీలక సమాచారాన్ని కొంతమంది వ్యక్తులు చైనాకు చేరవేస్తున్నారు అనుమానంతో నిఘా  ఏర్పాటుచేసిన ఎఫ్ డిఐ .. ఐదుగురు చైనా ఏజెంట్ లని గుర్తించింది. వెంటనే వారిని అరెస్టు చేసింది. ఐదుగురు చైనీస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లను ఎఫ్ డి ఐ  పట్టుకుంది. ఇందులో ఇద్దరు విద్యార్థులు  ఉండగా మరో ముగ్గురు ప్రొఫెషనల్గా కొనసాగుతున్నారట. ఇక వీరి  నుంచి మరింత కీలక సమాచారం సేకరించాలని ఎఫ్డిఐ ప్రయత్నిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: