ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చి  భారత్లో వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి ఇక్కడ స్థిరపడి చివరికి భారత్ ను తమ  ఆధీనంలో కి తెచ్చుకొని ఆంగ్లేయులు పాలించినట్లు గానే  ప్రస్తుతం పాకిస్తాన్ సిరియా  దేశాలకు చెందిన కొంతమంది వివిధ దేశాలకు వెళ్లి అక్కడ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడటమే కాదు మత రాజ్య స్థాపన లక్ష్యం గా అక్కడ అందరినీ ఆకర్షిస్తూ తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ దేశాల్లో ఇలాంటి రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి.



 పాకిస్తాన్ సిరియా లాంటి దేశాల నుంచి వచ్చిన ఎంతో మంది పౌరులు తమ సంప్రదాయాల వైపు మతాల వైపు ఆయా దేశాల ప్రజలను  ఆకర్షితులను చేసి ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం పై తీవ్రస్థాయి లో వ్యతిరేకత వచ్చేలాగా చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ఫ్రాన్స్ లో  తీవ్రతరం అవుతున్నాయి అని అక్కడి ప్రభుత్వం గమనించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ సిరియా  నుంచి వచ్చిన కొంతమంది పౌరులు అక్కడ వ్యాపారం ఉద్యోగం చేసుకోవడమే కాదు ఏకంగా ఫ్రాన్స్ ప్రజల యొక్క హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్న తరుణం లో ఫ్రాన్స్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది.



 ఈ క్రమంలోనే   ఫ్రాన్స్ లో  మత రాజ్య స్థాపన కోసం ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎవరైనా మత రాజ్య స్థాపన కోసం ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇప్పుడు మరో సారి ఎంతో కఠిన నిర్ణయం తీసుకుంది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఎవరైనా రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం కి పాల్పడితే ఉపేక్షించేది లేదు ఎక్కడికక్కడ కాల్చి పారేయాలి అంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. ఫ్రాన్స్  ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: