తెలంగాణలో మీడియా అంతా అధికార పార్టీకి ఆగ్రహం తెప్పించకుండానే నడుస్తోంది. ఏ మీడియా కూడా అధికార పార్టీని గట్టిగా అడిగేందుకు విమర్శించేందుకు సాహసించడం లేదు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే టీవీ9, ఏబీఎన్ వంటి మీడియాలకు చుక్కలు చూపించారనే చెప్పాలి. ఆ తర్వాత మిగిలిన మీడియా సంస్థలు కూడా టీఆర్ఎస్‌ కు అంతులేని అధికార బలం ఉండటంతో మనకెందుకొచ్చిన గొడవ అన్నట్టు వెళ్లున్నాయి. దీంతో అధికార పార్టీని నిలదీసే మీడియా తెలంగాణలో పెద్దగా లేకపోయింది.

కాస్త ఇప్పుడిప్పుడే వెలుగు, వీ6 మీడియా సర్కారును నిలదీస్తోంది. ఆ ఛానల్ యజమాని బీజేపీలో చేరడంతో కాస్త ఈ పత్రిక ఘాటుగానే సర్కారు వ్యతిరేక వైఖరి తీసుకుంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా 10 టీవీ తెలంగాణ మంత్రి రాసలీలకు సంబధించి ఓ వాట్సప్ స్క్రీన్ షాట్లతో కుమ్మేస్తోంది. మంత్రి గారి రాసలీలలు పేరుతో ధైర్యంగా స్టోరీ ప్రసారం చేయడమే కాకుండా.. అదే స్టాండ్ కొనసాగిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ మంత్రి గారి రాసలీల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.

10టీవీలో ప్రసారమైన మంత్రి లీలల కథనాలతో రాజకీయ దుమారం రేగింది. ఈ మొత్తం ఎపిసోడ్‌పై ఏకంగా ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మంత్రితో సన్నిహితురాలికి ఉన్న సంబంధాలు.. మంత్రిపై మరో యువతి సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ల వరకు అసలేం జరిగింది..? ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనే కోణంలో ఇంటెలిజెన్స్‌ ఆరా తీస్తున్నట్టు 10 టీవీ చెబుతోంది. మొత్తం మీద.. 10టీవీవరుస కథనాలు, ఇంటెలిజెన్స్ ఎంట్రీతో సదరు మంత్రిగారి పదవిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారట.

10 టీవీ జోరుతో మంత్రి పార్టీ పెద్దలకు సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆ టీవీ చెబుతోంది. విచిత్రం ఏంటంటే.. ఇంతకీ ఆ మంత్రి ఎవరన్న పేరు మాత్రం ఆ ఛానల్ చెప్పడం లేదు. దీంతో ఆయన ఎవరనే అంశంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: