ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ గొప్పలు చెప్పుకోవడం కాదు, దానికి తగ్గట్టుగానే ఎత్తుగడలు వేస్తూ, అధికార పార్టీ కి చుక్కలు చూపిస్తున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. 2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే టిడిపి దక్కించుకుంది. వైసీపీ 151 స్థానాలను దక్కించుకుని తమకు ఎదురేలేదు అన్నట్లుగా హడావుడి చేసింది. ఇక 151 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో. ఏపీలో తమకు ఎక్కదా అడ్డే ఉండదు అనే లెక్కలు వేసుకున్నారు. అయితే  చంద్రబాబు రాజకీయం ముందు ఇప్పుడు జగన్ సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.



 టిడిపి ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాజధాని వ్యవహారాన్ని తెరమీదకు తీసుకువచ్చి అమరావతి రాజధాని అంటూ చంద్రబాబు ప్రకటించారు. దాని కోసం 2019 ఎన్నికల వరకు హడావుడి చేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ సంచలన నిర్ణయం తీసుకుని, విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు అప్పటి నుంచి హడావుడి చేస్తూనే వస్తోంది. కానీ మూడు రాజధాని లకు సంబంధించి అధికారికంగా ముందుకు వెళ్లకుండా చంద్రబాబు బంధం వేయడంలో సక్సెస్ అవుతూనే వస్తున్నారు. విశాఖలో పరిపాలన రాజధాని అంటూ, హడావుడి చేస్తున్నా, అక్కడి వ్యవహారాలు ఇంకా ఒక క్లారిటీ కి రాలేదు.



ప్రస్తుతం ఈ అంశం కోర్టుల్లో పెండింగ్ లో ఉంది. ఒకవేళ హైకోర్టులో వైసీపీ కి అనుకూలంగా తీర్పు వచ్చినా, దాని పై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ను కూడా టిడిపి వదిలిపెట్టదు. ఈ లెక్కన చూస్తే ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. టీడీపీ కి కావాల్సింది కూడా ఇదే . ఏదో రకంగా అమరావతి సెంటిమెంటును రెచ్చగొట్టి, మరి కొంత కాలం పాటు రాజకీయ పబ్బం గడుపుకోవాలని టిడిపి ప్లాన్ వేస్తోంది. 



అలాగే 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని టిడిపి అధినేత చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అప్పటి వరకు అమరావతి ఉద్యమాన్ని ముందుకు నడిపించడం చంద్రబాబుకు పెద్ద కష్టమేమీ కాదు. అలాగే వైసిపి ప్రభుత్వం ఏపీ ని అభివృద్ధి చేస్తాం అంటూ మాటలు చెబుతుంది తప్ప, చేతల్లో చేసి చూపించ లేకపోతుంది అంటూ టిడిపి వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసి రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: