తెలంగాణ సర్కార్ పాలన పై పూర్తి వ్యతిరేకత వినపడుతుంది.. ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్శలు అందుతున్నాయి.. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను పట్టించుకోలేదని , నిన్న కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొన్న నామ్ కే వాస్తు అన్నట్లు మొక్కుబడి చెల్లించారని వినపడుతుంది. అయిన తెలంగాణ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు.. కనీసం వరద నీరు తగ్గిన తర్వాత అయిన పాడైన రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రజాభిప్రాయం...



ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు.. ప్రస్తుతం ఎన్నికల సెగ ఉన్న ఆనేక విషయాలలో అన్యాయం జరిగింది ...గతంలో కేసీఆర్ ముఖ్య మంత్రి కాక మునుపే ప్రజలు ఆయన ఆశయాలను గౌరవించారు. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చారు.. టీఆర్ఎస్ సవతి తల్లి ప్రేమను చూపారు ... టీఆర్ఎస్ దుబ్బాకను నిర్లక్ష్యం చేస్తున్నారు. దుబ్బాక ప్రజల్లో చైతన్యం వచ్చింది.టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల నియోజకవర్గాలలో అభివృద్ధి జరిగింది. దుబ్బాక పోటీలో ఉన్న ముగ్గురిలో ఎవరు దుబ్బాక ప్రజల గొంతుకవుతారో వారినే ఆశీర్వాదించాలి.




అలాంటి వ్యక్తి ఎవరనేది మీ ఊహకే వదిలేస్తున్నాం అంటూ ఆయన అన్నారు. దుబ్బాక నియోజక వర్గం నుంచి పోటీ చేసిన వ్యక్తులలో ముఖ్యమైన వ్యక్తి రఘునందన్ రావు ఓడినా మీ కష్ట సుఖాలలో రఘు ఉన్నారు.తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారు  కానీ , కేసీఆర్ అంటున్నారు..  తాను సీఎం కావాలనే ఆత్మబలిదానాలు చేశారని, తెలంగాణ వస్తే ప్రజలకు మంచి జరుగుతుందని అనుకున్నాము కానీ ఇప్పుడు ప్రజల గోడును చూస్తున్నాము. కానీ తెలంగాణా వచ్చాక అభివృద్ధి కుంటుపడింది .కుటుంబ పాలన , అప్పులు , అవినీతి తెలంగాణలో రాజ్యమేలుతున్నాయి.తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించడం బీజేపీకే సాద్యం.. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే 12 మంది ఎమ్మెల్యేలు గాంధీభవన్ నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు . ప్రజలు దుబ్బాక ఆత్మగౌరవం నిలవాలంటే , డెవలప్ జరగాలంటే రఘునందన్ రావును గెలిపించాలి అంటూ ఆయన తెరాస పై విమర్శలు గుప్పిస్తూ , మరోక వైపు ప్రచారాన్ని ప్రారంభించారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: