టెలికాం సంస్థలు వినియోగదారులకు ఝలక్లు ఇస్తున్నాయి. ప్రముఖ బిజినెన్ మెస్, రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ జియోతో చౌక ధరలకే డేటా, కాల్స్ కూడా ఉచితంగా అందించారు. ఇతర టెలికాం కంపెనీలు కూడా ఇదే దారిలో నడిచాయి. వరుసగా అన్ని కంపెనీలు తమ టారిఫ్ ధరలను తగ్గించేసుకున్నాయి. కానీ ఇప్పుడు అన్ని కంపెనీలు తమ టారిఫ్ ధరలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, ఐడియా తదితర కంపెనీలు తమ టారిఫ్ చార్జీలను పెంచేశాయి.

రానున్న రోజుల్లో మొబైల్ టారిఫ్ ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్ టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గోపాల్ విట్టల్ కూడా పరోక్షంగా టారిఫ్ ధరలు పెరుగుతాయని తెలిపారు. ఎయిర్ టెల్ ఆర్థిక ఫలితాలు వెల్లడి తర్వాత గోపాల్ విట్టల్ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భవిష్యత్ లో టారిఫ్ ధరలు పెరగవచ్చని ఆయన తెలిపారు. అయితే ఈ ధరల ఎప్పటి నుంచి పెరుగుతాయనే విషయంపై స్పష్టత లేదని ఆయన వెల్లడించారు.

కస్టమర్ల నుంచి పొందే సగటు ఆదాయాన్ని (ఏఆర్ పీయూ) రూ.200 నుంచి రూ.300 వరకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్ పీయూ రూ.162గా ఉంది. ఏడాది కిందట ఇది రూ.128కి చేరింది. ప్రస్తుతం ఎయిర్ టెల్ ఏఆర్ పీయూని రూ.200 నుంచి రూ.300 పెంచాలనుకుంటోంది.

వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. అంతేకాకుండా తక్కువ ధరకే ఫోన్ అందించే ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 16 దేశాల్లో 44 కోట్ల మంది వినియోగదారులు ఉన్నాయి. ఈ మేరకు భారత్ లో ఆగస్టు నెలలో టారిఫ్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని భారతీయ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టర్ పేర్కొన్నారు. ట్రాఫిక్ ధరలు పెరగడంతో వినియోగదారులపై అధిక భారం పడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: