తెలంగాణ లో మంత్రి హరీష్ రావు సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా సరే ఆయన మాత్రం ఆ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు. ముందు నుంచి కూడా సీఎం కేసీఆర్ కి అన్నివిధాలుగా అండగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారని కొంతమంది నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సీఎం కేసీఆర్ మాత్రం ఆయనకు చాలావరకు ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయనకు రాష్ట్రంలో ఆర్థిక శాఖ అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో శాఖను కూడా అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే బీజేపీ నేతలు హరీష్ రావు ని టార్గెట్ చేసిన సమయంలో కొంతమంది టిఆర్ఎస్ నేతల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఉప ఎన్నికల ప్రచారం లో భారీగ హరీష్ రావుని టార్గెట్ చేస్తూ బీజేపీ నేత లు ఎన్నో విమర్శలు చేస్తున్నారు. అయినా సరే ఆయన కు మాత్రం కొంతమంది నుంచి సహాయ సహకారాలు అందటం లేదు. దీనిపై హరీష్ రావు కాస్త సీరియస్ గానే ఉన్నారని అంటున్నారు. పార్టీలో ఒకప్పుడు సన్నిహితంగా ఉన్నవారు కూడా ఇప్పుడే అలా సైలెంట్ గా ఉండటం పై హరీష్ రావు కాస్త అలిగినట్టు గా కూడా తెలుస్తుంది.

దీని వెనుక కారణం ఏంటి అనేది తెలియదు కానీ ఇప్పుడు కొంతమంది బీజేపీతో కలిసి తన మీద కుట్ర చేస్తున్నారని ఆయన నుంచి ఆవేదన వ్యక్తమవుతుంది. దీనిపై మంత్రి హరీష్ రావు కాస్త సీఎం కేసీఆర్ కి ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కోసం కొంతమంది కష్ట పడటం మానేసి ఇతర పార్టీల కోసం కష్టపడి పని చేస్తున్నారని దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా అలా పని చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన కేసీఆర్ ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: