ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  తలెత్తిన ఉద్రిక్తల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో శక్తివంతమైన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేరుతూ భారత ఆర్మీ మరింత పటిష్టవంతం చేస్తుంది . ఇప్పటికే భారత రక్షణరంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఎన్నో రకాల ఆయుధాలకు  శరవేగంగా పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలకు పరీక్షలు నిర్వహిస్తున్న డి ఆర్ డి ఓ ప్రస్తుతం శరవేగంగా వాటిని భారత అమ్ములపొదిలో చేర్చేందుకు సిద్ధమవుతోంది.



 ఈ క్రమంలోనే డి ఆర్ డి ఓ ఎంతో ప్రతిష్టాత్మకంగా బ్రహ్మోస్  మిస్సైల్ ని కనిపెట్టిన విషయం తెలిసిందే. అయితే డీఆర్డీవో అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ మిస్సైల్ కి మొదట పరీక్ష జరిగి విజయవంతం అయింది. ఎంతో సమర్థవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది బ్రహ్మోస్ మిస్సైల్.  కానీ బ్రహ్మోస్ మిస్సైల్ కి వేగాన్ని శక్తిని పెంచేందుకు డి.ఆర్.డి.ఓ మరింత సరికొత్త టెక్నాలజీని పొందుపరిచి  మరిన్ని సార్లు పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మరోసారి బ్రహ్మోస్ మిసైల్ సత్తా చాటింది. ఇది భారత వాయుసేనకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. బ్రహ్మోస్ మిస్సైల్  మరోసారి ప్రయోగించి విజయవంతం అయ్యింది భారత వాయుసేన.



 ఇక ఈ సారి ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఎంతో సమర్థవంతంగా కచ్చితత్వంతో ఛేదించింది బ్రహ్మోస్ మిస్సైల్. సుఖోయ్ 30ఎమ్కేఐ  యుద్ధ విమానం ద్వారా ఈ బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగించారు.  కాగా ఈ బ్రహ్మోస్ మిసైల్ ఎంతో సమర్థవంతంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో ఉన్న నౌకలను ధ్వంసం చేసింది.   పంజాబ్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన బ్రహ్మోస్ మిస్సైల్ గాలిలోనే ఇంధనం నింపుకుని దూసుకుపోయింది. ప్రస్తుతం చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బ్రహ్మోస్ మిస్సైల్  ఎంతో శక్తివంతంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని చేదించడం ఒక శుభపరిణామం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: