తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడి ఇప్పుడు కూడా వారి పార్టీ కోసం పని చేస్తూనే ఉంటారు. అయితే వారికి అనుకున్న విధంగా అవకాశాలు మాత్రం వచ్చే పరిస్థితి ఉండదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ప్రధానంగా కడప జిల్లాకు చెందిన కొంతమంది నేతలు అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన కొంతమంది నేతలు పార్టీ కోసం కష్టపడిన సరే వారికి మాత్రం చంద్రబాబు నాయుడు అసలే మాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు అని ఆరోపణలు ఎక్కువగా కనబడుతుంటాయి.

 రాజకీయ వర్గాల్లో కూడా దీనిపై చర్చలు కూడా జరుగుతూ ఉంటాయి, దీంతో వారు పార్టీ మారాలి అని భావించినా సరే కొన్ని పరిణామాల కారణంగా మారలేక పోతూ ఉంటారు అని అంటూ ఉంటారు, ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు కొన్ని వార్తలు వస్తున్నాయి, చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన కొంతమంది నేతలు వైసీపీ లోకి వెళ్ళడానికి మార్గం సుగమం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి, పార్టీ కోసం ముందు నుంచి పనిచేస్తున్న సరే వారిని ఏమాత్రం పట్టించుకోక పోవడం అదేవిధంగా ఎన్నికల్లో ఎప్పుడు సీట్లు ఇవ్వకపోవడం వచ్చే ఎన్నికల్లో కూడా సీట్లు ఇవ్వకుండా వారిని పక్కన పెట్టే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుని ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

 త్వరలోనే కొంతమంది నేతలు బీజేపీ లోకి అదేవిధంగా వైసీపీ లోకి వెళ్లే అవకాశాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు మహిళా నేతలు చంద్రబాబు నాయుడుకి సొంత జిల్లాలోనే గుడ్బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి వారు ఎవరు ఎప్పుడు మారుతారు ఏంటి అనేది చూడాలి అదే విధంగా కర్నూలు జిల్లాకు చెందిన ఒక కీలక నేత కూడా ఇప్పుడు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: