నిన్నటి నుంచి తెలంగాణ కు చెందిన ఓ మంత్రి వ్యవహారాలకు సంబంధించి ఓ ప్రముఖ మీడియా ఛానల్ లో అదే పనిగా వార్తాకథనాలు ప్రచారం చేసింది. రాసలీల మంత్రి అంటూ... బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేస్తూ హడావుడి చేశారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద కలకలం రేగింది. దీంతో ఆ కథనాలలో ఉన్న మంత్రి ఎవరబ్బా అనే ఆసక్తి అందరిలోనూ రేగింది. అయితే ఎక్కడా మంత్రి పేరు ప్రస్తావించకుండానే, ఆయనకు సంబంధించిన కొన్ని వాట్సాప్ చాటింగ్ లు, వాటి స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిల్లో విషయం ఎంత ఉంది అనేది ఎవరికీ తెలియకపయినా, వాటికి సంబంధించిన కథనాలను ఒక ప్రముఖ ఛానల్ అదేపనిగా ప్రచారం చేస్తూనే హడావుడి చేసింది. ఒక సినీ హీరోయిన్ తో సదరు మంత్రిగారు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి వాట్స్ప్ ప్ చాటింగ్ లు , వీడియోలు ప్రచారం అయ్యాయి. 


అయితే నేరుగా సదరు మంత్రి పేరు ను కానీ, ఆయనకు సంబంధించిన క్లూ కానీ ఎక్కడ ప్రచారం చేయక పోవడంతో , మంత్రులు అందరిపైనా అభిమానులు మొదలయ్యాయి. అసలు ఎవరా మంత్రి అంటూ జనాలు సైతం ఆరా తీయడం వంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. చివరకు తమ ఛానల్ కు చెందిన కథనాలను ప్రచారం అవ్వకుండా కరీంనగర్ లో టీవీ ప్రసారాలను నిలిపివేశారని ప్రకటించడంతో సదరు మంత్రి కరీంనగర్ జిల్లాకు చెందిన వారనే విషయం అర్థమైంది. సదరు టీవీ ఛానల్ మళ్లీ కరీంనగర్ లో తమ ఛానెల్ ప్రచారాలు మొదలయ్యాయని మళ్లీ ప్రకటించుకుంది. దీంతో ఉద్దేశపూర్వకంగానే మంత్రిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. 


దీనికి తగ్గట్టుగానే ఇటీవల నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన కవిత మంత్రి పదవి కోసం వెయిటింగ్ లో ఉన్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే సదరు మంత్రిపై ఈ విధమైన ఆరోపణలు వెలువడ్డాయా ? ఆయనతో రాజీనామా చేయించి కవితకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు ఎన్నో మొదలయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: