ఈ మధ్య కాలంలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడూ ఉంటుంది ఏంటి అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇంకా లేకపోయినా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పుడు కొంత మంది పేర్లను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు చెందిన కొంతమంది సీనియర్ నేతల పేర్లను ఎక్కువగా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయంగా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో పార్టీ బలోపేతం కావాల్సిన అవసరం ఉంది.

దీనితోనే సీనియర్ నేతలకు కొంతమందికి పదవులు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశంపార్టీ నుంచి వచ్చి కొంతమంది నేతలు ఏ పదవులు లేకుండా అలాగే ఉండిపోయారు. అందులో ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. అంతే కాకుండా నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. దీంతో వీరికి పదవులు ఇస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి గత ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు ని తీసుకున్నా సరే ఇప్పుడు మాత్రం ఆయనను పక్కన పెడుతున్నారు.

ఎందుకు ఏంటి అనే విషయం స్పష్టత లేదని దీనిపై మాత్రం ఆయన కాస్త అసహనంగానే ఉన్నారు. ఆయనతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు అని ప్రచారం ఈ మధ్య కాలంలో జరిగింది. అది ఎంతవరకు నిజం అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే ఇప్పుడు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకునే కీలక శాఖ ఒకటి అప్పగించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు త్వరలోనే ఎమ్మెల్సీగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించే అవకాశాలు ఉండవచ్చు అని అంటున్నారు. గతంలో ఇదే శాఖలో ఆయన చాలా సమర్థవంతంగా పని చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: