ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ విషయంలో సీఎం జగన్ చాలావరకు కూడా జాగ్రత్తగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కటి కూడా విద్యా వ్యవస్థలో ఆయన పక్కాగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సరే విద్యా వ్యవస్థలో అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసే విధంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ విషయంలో అమలు అవుతున్న సంగతి అర్థమవుతుంది. ఇక తాజాగా సీఎం జగన్ మరో అడుగు వేశారు.

ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజ్ లు లలో ఫీజ్ విధానం పై ఆంధ్రప్రదేశ్  సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంద్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రేగులేటరీ మోనిటరింగ్ కమిషన్, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లనుండి పలు సూచనలు విద్యా శాఖ అందుకుంది. కోవిడ్ వ్యాప్తి కారణం గా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆర్థిక మందగమనం సాగుతోందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.

ఏపీ లోను ఆర్థిక వ్యవస్థ చాలా మందగమనం నమోదు చేసిందని తెలిపింది. ఈ నేపధ్యంలో ప్రైవేటు స్కూళ్లు.. కాలేజీల్లో ఫీజు వసూళ్లపై ఏపీ ప్రభుత్వం నియంత్రణ దిశగా అడుగులు వేసింది. కరోనా కారణంగా ప్రజల ఆర్ధిక కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఫీజులు తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ట్యూషన్ ఫీజులో 30 శాతం మేర తగ్గించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కారణంగా చాలా కాలం పాటు స్కూళ్లు, కాలేజీలు తెరవలేదు కాబట్టి నిర్వహాణ భారం తగ్గి ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. నవంబర్ రెండో తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభించనున్న క్రమంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఆ మేరకు సిలబస్ కూడా తగ్గించి భారం కాకుండా చూస్తామని ఉత్తర్వులు జరీ చేసింది. దీనిపై తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: