ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ని జగన్ ఇప్పటికే వెలికి తీసే ప్రయత్నంలో జగన్ ఉన్నారు.. ఆ క్రమంలోనే కొంతమంది ఎలుకల్ని జైలుకి పంపాడు.. వారు కూడా అవినీతి ఆరోపణల్లో నిజం నిర్ధారణ అవడంతో సైలెంట్ గా ఉండక తప్పట్లేదు.. ప్రతిపక్ష పార్టీ లో అవినీతికి పాల్పడ్డ వారిపై జులుం విప్పుతూ వారిని జైలుకి పంపిస్తూ ప్రజలకు అవినీతి లేని సామ్రాజ్యాన్ని సృష్టించే పనిలో ఉన్న జగన్  పాలనా విషయంలో కూడా ఎంత పారదర్శకత చూపిస్తున్నాడు.. అయితే చంద్రబాబు జగన్ పై పగపట్టినట్లు వ్యవహరిస్తున్నాడు..

కొత్తగా వచ్చిన సీఎం ని మంచి చెడు చెప్పేది పోయి ఇలా  పగ పట్టినట్లు ప్రవర్తించడం చంద్రబాబు అసూయా ని తెలియజేస్తుందని అంటున్నారు.. సొంత పార్టీ నేతలు సైతం జగన్ పై చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.. ఇక ఈ విషయం పొరుగు రాష్ట్రాలకి చేరింది.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అనుస‌రిస్తున్న తీరు ప‌క్క రాష్ట్రాల్లో కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అభివృద్ధి వైపు దూసుకెళ్తూ ఏపీలో నూత‌న శ‌కం ప్రారంభ‌మ‌వుతున్న‌ వేళ‌.. అది రుచించ‌ని టీడీపీ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు, సంక్షేమ ప‌థ‌కాల‌కు అడ్డుత‌గులుతున్నతీరును అంద‌రూ గ‌మ‌నిస్తున్నార‌న‌డానికి ఇదో నిద‌ర్శ‌నం.

ఇదిలా ఉంటే జగన్ రాష్ట్రాన్ని రైతు రాజ్యం చేయాలనీ వారికి పలు వరాలు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే.. వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయం చేస్తున్న రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు ఇతర సేవలను అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ రంగంలో మరో సరికొత్త కార్యక్రమానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. విత్తనాలు సమకూర్చుకోవడంలో రైతులు తిరిగి స్వయం సమృద్ధి సాధించేలా చేసేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ‘విత్తన గ్రామం’ పేరిట జరగబోయే ఈ కార్యక్రమం ద్వారా రైతులు తమకు అవసరమైన వివిధ సాగు విత్తనాలను వారే సమకూర్చునేలా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: