ఉదయం నిద్రలేవగానే చాల మందికి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే నిద్రలేవగానే మంచి నీళ్లు తాగడం వల్ల రోగాలు దరిచేరవని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో తినడానికి, తాగడానికి కూడా సమయం దొరకడం లేదు. దీని వల్ల మనకు తెలీకుండా మనమే అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి మన ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి నీటిని తాగే అలవాటు చేసుకుందాం.

అయితే పళ్లు తోమకుండానే టీ, కాఫీలు తాగే బదులు.. కడుపు నిండుగా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది చూద్దామా. ఉదయం ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల పెద్ద ప్రేగు శుభ్రమవుతుంది. దీనివల్ల మరిన్ని పోషకాలు గ్రహించి కొత్త రక్తం తయారీకి ఉపయుక్తంగా మారుతుంది. రోజూ ఉదయాన్నే కనీసం అర లీటరు నీళ్లు తాగినా చాలు.. శరీరంలో మెటాబాలిజం మెరుగవుతుంది. రక్త కణాలను శుద్ధి చేసి శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు రోజు పరగడుపున నీళ్లు తాగితే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

రాత్రి సమయంలో మనం దాదాపు 6 నుంచి 8 గంటల వరకు ఎటువంటి నీటి వినియోగం లేకుండా నిద్రపోతూ ఉంటాము. అలా ఉండడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. అందువల్ల ఉదయం లేవగానే రెండు గ్లాసుల నీటిని తీసుకోవడం వల్ల తిరిగి మన శరీరం రీహైడ్రేషన్ స్థితికి వస్తుంది. దీని ద్వారా రోజంతా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పనులు చేసుకోవచ్చు. అంతేకాదు మన మెదడుకు దాదాపు 70 శాతం పైగా నీటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే డీహైడ్రేషన్ అవుతుందో అప్పుడు మెదడు పనితీరులో హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. దీని ప్రభావం మన జ్ఞాపకశక్తి మీద పడుతుంది. అందుకే ఉదయం లేవగానే నీరు తాగడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: