ఈ ఎన్నికల్లో  ప్రజల తీర్పు తో ఎంతో ఘన విజయం సాధించి వైసీపీ పీఠమెక్కిన సంగతి తెలిసిందే.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, అన్యాయాల దృష్ట్యా ప్రజలు జగన్ కి ఉన్న పాపులారిటీ తో ఆయనపై నమ్మకం ఉంచారు.. ఆ తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు అందరికి తెలిసందే.. రాజధాని తరలింపు అంశం రాష్ట్రంలో ప్రధానాంశంగా ఇప్పుడు తయారైంది. ప్రతిపక్షాలు దీన్ని తీవ్రం గా తప్పుబడుతున్న జగన్ మాత్రం అనుకున్నది సాధించి తీరారు..

మరోవైపు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటూనే అధికార పక్షంలో ఉన్నట్లు ఫీల్ అవుతున్నారు.. అందుకే తాను ముఖ్యమంత్రి పదవి లో ఉన్నానన్న భ్రమలో బతుకుతూ ఉన్నాడు.. మొదటినుంచి జగన్ ను ఇంకా ప్రతిపక్ష నేతగా చూస్తూ ముఖ్యమంత్రి అని చూడకుండా ఓ పార్టీ సాధారణ కార్యకర్తలా విమర్శిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు.. అమరావతి విషయంలో జగన్ ను చంద్రబాబు పెట్టిన ఇబ్బంది అందరికి తెలిసిందే.. మరోవైపు తన మనుషుల తో ప్రభుత్వం పై కేసులు వేసి పైశాచిక ఆనందం పొందారు.. తన అనుకూల మీడియాలో జగన్ పై దుష్ప్రచారం చేయడం ద్వారా జగన్ పై మెచ్చే వేసే ప్రయత్నం చేశారు..

ఇదిలా ఉంటే వైసీపీ లోకి వచ్చెనందుకు మరో టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది.. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే వెళ్ళడానికి సిద్మయ్యేరట..ఇటీవల గంటా శ్రీనివాసరావుకి  వైసీపీ నుంచి ఆఫర్ వెళ్ళినాట్లు వార్తలు వచ్చాయి.. అయితే అదే ఆఫర్ ను సదరు ఎమ్మెల్యే కి కూడా  ఇచ్చారని టీడీపీ వర్గాలు అంటున్నాయి... ఇప్పుడు కనుక  రాజీనామా చేస్తే కచ్చితంగా మీకు అదే నియోజకవర్గం నుంచి సీటు ఇస్తామని… వెంటనే కేబినెట్ విస్తరణలో మిమ్మల్ని కేబినెట్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.. మరి దీనిపై వైసీపీ ఏమని సమాధానం చెప్తుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: