ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని  నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కరోనా  వైరస్ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇక ప్రస్తుతం ప్రజలందరూ కరోనా వైరస్ పై అవగాహన పెంచుకుని ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ఉన్న తరుణంలో కూడా ఏదో ఒక విధంగా మహమ్మారి కరోనా వైరస్ పంజా విసురుతు ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. దీంతో రోజురోజుకు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రపంచ ప్రజానీకం మొత్తం కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.


 అయితే ఇప్పటికే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కి చెక్ పెట్టేందుకు పలు రకాల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే  పలు దేశాలు కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రాగా మరికొన్ని వ్యాక్సిన్ లు  క్లినికల్ ట్రయల్స్ లో ప్రస్తుతం కీలక దశకు చేరుకున్నాయి. దీంతో ప్రస్తుతం ప్రపంచ ప్రజానీకం మొత్తం వ్యాక్సిన్  కోసం ఎదురుచూస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే వారికి తగిన వైద్య సహాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వినూత్న ఆలోచన చేసింది.



 ఓ సరికొత్త బీమా పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల తెరమీదికి తెచ్చింది. ఇక ఈ బీమా పథకం కోసం కొవాక్స్  ప్రమోటర్లు.. డబ్ల్యూహెచ్వో, గావి  సంయుక్తంగా సహాయ నిధి ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్  ను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా.. ఈ కొవాక్స్  కూటమి ఏర్పడినట్లు తెలుస్తోంది. వ్యాక్సిన్  వాడకంపై ఎంతో మంది లో భయాలు సందేహాలు తొలగించేందుకే ఈ బీమా పథకాన్ని తీసుకు వచ్చినట్లు వివరించింది కొవాక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: