బాబోయ్.. బిట్ కాయిన్ వ్యవహారం ముదురుతోంది... మంచికే కాదు చెడుకు కూడా సహాయపడుతుంది..... అక్రమ వ్యాపార దారులకు, కిడ్నాపర్ల కు.... కుట్రపూరిత వ్యక్తులకు ఆయుధంగా మారుతోంది. అసలు బిట్ కాయిన్ అంటే ఏంటో తెలుసా...... కరెన్సీ ఎలాగో ఇది కూడా మనుషుల అవసరాలను తీర్చుకునేందుకు మనిషి చేత సృష్టించబడ్డ ఒక అవసర మూలం. బిట్ కాయిన్ అంటే రూపం లేని డిజిటల్ మనీ. 2008లో దీనిని కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా సతోషి నకమోటో అనే వ్యక్తి కనుగొన్నారని చెబుతుంటారు. ఈ బిట్ కాయిన్ ప్రత్యేకత ఏమిటంటే... ఇవి చేతులు మారడం చాలా సులభం.... అందులోనూ దీనిని ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. అంత రహస్యంగా దీని మార్పిడి  రూపొందించబడింది.

అయితే కేవలం 21 వేల మిలియన్ల బిట్ కాయిన్లు మాత్రమే ఉంటాయి. ఇప్పటికే 16 వేల మిలియన్ల బిట్ కాయిన్లు అమ్ముడుపోయాయి. పరిమితమైన సంఖ్యలో ఈ బిట్ కాయిన్స్ ఉండటంతో వీటికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతూ దాంతోపాటు విలువ కూడా అమాంతం పెరుగుతోంది. ఒక బిట్ కాయిన్ విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!! ప్రస్తుతానికి ఒక బిట్ కాయిన్ విలువ రూ. 10 లక్షలకు పైగానే పలుకుతోంది.... భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ బిట్ కాయిన్ అమ్మకాలు  తరచూ జరుగుతూనే ఉంటాయి... కానీ ఎవరు కొనుగోలు చేశారు ఎవరు విక్రయించారు అనే విషయాలు మాత్రం ఎవరికీ తెలియవు. ఇదే ఇప్పుడు నేరగాళ్లకు... అక్రమ దారులకు ఆయుధంగా మారింది.

కిడ్నాపర్లు, సైబర్ నేరగాళ్లు,హ్యాకర్లు అంతర్జాతీయ స్థాయిలో రూపాయలు, డాలర్లు, పౌండ్లు, యూరో వివిధ రకాల కరెన్సీలను బిట్ కాయిన్ల రూపంలోకి  మార్చి తమకు పంపించాలంటూ బాధితులను డిమాండ్ చేస్తున్నారు. తద్వారా వారు ఎవరన్న విషయం బయట పడకుండా వివరాలు సేఫ్ గా ఉండే అవకాశం ఉంది. ఇటీవల   సైబరాబాద్ పరిధిలో కిడ్నాప్ నకు గురైన డాక్టర్ ను దుండగులు రూ. 10 కోట్లు ఇస్తేనే విడిచి పెడతామంటూ డిమాండ్ చేశారు... అందులోనూ వారు అడిగిన మొత్తాన్నిబిట్ కాయిన్లలో తమకు పంపించాలంటూ హెచ్చరించారు. అంతేకాదు తరచూ హ్యాకింగ్ లకు పాల్పడే నేరగాళ్లు సైతం... ఈ బిట్ కాయిన్లను తమకు అనువుగా మలుచుకుంటున్నారు.

ఇటీవలే నైజీరియన్ సైబర్ నేరగాడు రహస్యంగా ఖాతాలు హ్యాక్ చేశాడు. హ్యాక్ చేసిన తరువాత నగరానికి చెందిన వ్యాపారుల ఖాతాల నుంచి డబ్బును కలకత్తా లోని కొందరి ఖాతాల్లోకి బదిలీ చేయించాడు. ఆ బ్యాంకు ఖాతాలు సిమ్ కార్డులు సరఫరా చేసే ముఠా సైబర్ నేరగాడు కొట్టేసిన మొత్తం సొమ్ములో 40 శాతం తమ సొంతానికి వాడుకుని మిగిలిన దాన్ని నైజీరియన్ సైబర్ నేరగాడు పంపించిన ఒక లింక్ తో అతడి బిట్ కాయిన్ ట్రేడింగ్ ఖాతాను ఓపెన్ చేసి అందులో బిట్ కాయిన్స్ కొనుగోలు చేశారు. దీంతో ఆ డబ్బంతా అతడికి డిజిటల్ రూపంలోకి మారిపోయింది. .. ఈ విధంగా సులువుగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో బిట్ కాయిన్లలోనే పేమెంట్ చేయాలంటూ ఇటీవల ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బిట్ కాయిన్స్ ద్వారా సులువుగా పెద్ద మొత్తంలో డబ్బు పంపించుకోవచ్చు. ఈ బిట్ కాయిన్స్ ద్వారా షాపింగ్ చేసుకునే అవకాశం కూడా కొన్ని సంస్థలు కల్పిస్తున్నాయి. మరి ఈ అక్రమాలకు బిట్ కాయిన్స్ సహాయపడడం అన్న విషయాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు... దీనికి చెక్ పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: