కొన్ని  కొన్నిసార్లు అధికారుల నిర్లక్ష్యం ఏకంగా ప్రజల ప్రాణాల మీదికి తెస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రజల విషయంలో  అధికారులు జాలి దయ లేకుండా కఠినంగా వ్యవహరించడం ఏకంగా  ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఇంకా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా మూడేళ్ల చిన్నారికి  తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తుంది. అనంతపురం జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామాల ప్రజలను ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.



 కానీ సరైన పరిహారం అందకపోవడంతో చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గ్రామాల ప్రజలు ప్రజలందరూ ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదు అంటూ తేల్చి చెప్పారు. గ్రామంలోని సరైన పరిహారం చెల్లించకుండా అధికారులందరూ ముంపు గ్రామాల ప్రజల ఇళ్లను ఖాళీ చేయించి ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సరైన పరిహారం చెల్లించకపోవడంతో ముంపు గ్రామాల బాధితులు ఇళ్లల్లోకి చేరి తమ ఇళ్లను వదిలేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అధికారులు ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఇళ్లల్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా ఇళ్ల కూల్చివేత చేపట్టారు.



 ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన మర్రిమేకల పల్లి లో ఒక్క రూపాయి కూడా బాధితులకు పరిహారం అందించకుండా ఇల్లు ఖాళీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. కానీ బాధితులు మాత్రం తమకు పరిహారం అందలేదని ఇల్లు ఖాళీ చేసే ప్రసక్తి లేదు అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే ఏకంగా మనుషులు ఉన్న ఇళ్ళని  జెసిబి తో కూల్చారు  అధికారులు. దీంతో ఇంట్లో ఉన్న చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ప్రజల పట్ల కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన అధికారులపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: