ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు ఎంతో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు మధ్యలో ఇటు ప్రభుత్వానికి అటు ఎన్నికల సంఘానికి సయోధ్య కుదరడం లేదు. మరో వైపు ఎలాగూ ఉన్నారుగా చంద్రబాబు అండ్ బ్యాచ్. అధికారపార్టీకి... ప్రతిపక్ష పార్టీలకు ఈ మధ్య విభేదాలు ఎప్పుడూ ఉండే సర్వ సాధారణమైన విషయమే. రాజకీయం అన్న తర్వాత ఆ మాత్రం ఎత్తిపొడుపులు ఉంటాయి. కానీ ఈ మధ్య మన నేతలు మాట్లాడుతున్న వ్యవహార శైలి కాస్త శృతిమించుతోంది అని అంటున్నారు పలు రాజకీయ వర్గాల నేతలు. నిజానికి ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పెదవుల నుండి జారే ప్రతి మాట కౌంట్ అవుతుంది.... అలాంటిది వారు వేరొకరిని విమర్శిస్తున్న సమయంలో పదాల కాస్త అటూ ఇటూ అయితే... ఇక అంతే అది పెద్ద పాయింట్ గా కనబడుతుంది.

అందులోనూ కొందరు నేతలు విమర్శించే సమయంలో హెచ్చుతగ్గులు లేకుండా... తారతమ్యాలు మరచి  విమర్శలు అడ్డూ అదుపు లేని స్థితికి చేరిపోతాయి. ఇలాంటి పదాలన్నీ మంత్రుల స్థాయిలో ఉన్న నేతలు కొందరు ప్రస్తావిస్తున్న సందర్భంలో జరుగుతూ ఉంటాయి. కానీ  రాజ్యాంగబద్దమైన హోదాలో ఉండే ప్రజాప్రతినిధులు సైతం ఇదే తరహా మాటలు మాట్లాడుతున్నారని పలువురు  ఆరోపిస్తూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు..... ఇప్పుడు అదే లిస్టులోకి స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేరుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

గతంలో కూడా ఒకసారి పలు వివాదాస్పద వ్యాఖ్యల వలన స్పీకర్ తమ్మినేని సీతారాం హైలెట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అదే తరహాలో మరో సారి సీతారం ఘాటుగా కామెంట్ల వర్షం కురిపించారు. ఇప్పుడు మా ప్రభుత్వం ఏది చేసినా విమర్శిస్తున్నారే...మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసారు...౩౦ లక్షల నిరుపేదలకు ఇల్లు లేకుండా చేసింది మీరు కాదా అని చంద్రబాబు ని సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా అబద్ధపు మాటలు, అర్ధం లేని విమర్శలు మానండి అని టీడీపీ కి మరియు చంద్రబాబు కి హితవు పలికారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: