ఈరోజు అక్టోబర్ 31  ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంటుంది.. అలాగే ఈరోజు కూడా ఉంది .. నేడు  భారత తొలి ఉప-ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్  జయంతి .. ఈ జయంతిని  పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు  ఘనంగా నివాళి అర్పించారు. గుజరాత్‌లోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద శనివారం నిర్వహించిన ఏక్తా దివాస్‌ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.

ప్రధాని‌ పర్యటన నేపథ్యంలో పటేల్‌ విగ్రహం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.దేశవ్యాప్తంగా పటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కోవిడ్-19 విజృంభణ తర్వాత తొలిసారి సొంత రాష్ట్రం గుజరాత్‌లో మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ  ..  ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలూ ఉగ్రవాదంపై ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవశ్యకత ఉందని, తీవ్రవాదం, హింస వల్ల ఏ దేశానికి ప్రయోజనం ఉండదన్నారు.

రెండు రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం   స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీకి సమీపంలోని నాలుగు పర్యాటక ప్రదేశాలను మోదీ ప్రారంభించారు. ఔషధ మొక్కలతో 17 ఎకరాల్లో విస్తరించిన ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు. ఆ తరువాత, వివిధ రాష్ట్రాల చేనేత, చేతి వృత్తుల ఉత్పత్తులను పర్యాటకులు కొనుగోలు చేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏక్తామాల్‌‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు...దానితో పాటు ప్రపంచంలోనే తొలిసారిగా 35 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల పౌష్టికాహార థీమ్ పార్క్‌ను ప్రధాని ప్రారంభించారు.  అలాగే 375 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘జంగిల్‌ సఫారీ’ని కూడా మోదీ ప్రారంభించారు ..  

మీకు తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నారు .. సంస్థానాలను విలీనం చేయడం లో సర్దార్ వల్లభాయ్ గారి కృషి ఎంతో ఉంది... గుజరాత్ లో పుట్టిన సర్దార్ ..దేశానికి ఉప ప్రధానిగా పని చేసారు ..దేశానికి చేసిన సేవలకు గుర్తుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం లో గుజరాత్ నర్మదా నది తీరాన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యత విగ్రహాన్ని నెలకొల్పారు .. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం ..  

మరింత సమాచారం తెలుసుకోండి: