సరదాగా ఆడుకోవడానికి ఉయ్యాలా బాగా పనికొస్తుంది.. చాలా మంది చిన్న పిల్లలు ఉయ్యాల ఉంటే గాల్లో విహరించినట్లు ఉంటుందని చాలా మంది ఫీల్ అవుతారు.ముఖ్యంగా లాలి పాట పాడేది ఈ ఉయ్యాల.. అందుకే చిన్న పిల్లలను అందులో పడుకో బెడితే హాయిగా నిద్ర పోతారు..ఇకపోతే ఎంతో సరదానిచ్చే ఉయ్యాల ఒక్కోసారి ప్రాణాలను కూడా తీస్తుంది. చాలా సార్లు రుజువైంది కూడా.. తాజాగా మరో ఘటన జరిగింది. సరదాగా ఊగుదామని కట్టిన ఉయ్యాల ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది..




వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోనియూసుఫ్ గుడాలో జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం, ఎల్లాసకి చెందిన జెట్టా పల్లెం నర్సింహ, అంజలి దంపతులు బతుకు దెరువుకోసం నగరానికి వచ్చారు.. నగరంలోని యూసఫ్ గూడ లో వాళ్ళు నివాసముంటున్నారు.. వీరికి ఇద్దరు కొడుకులు.. పెద్ద కొడుకు లాక్ డౌన్ వల్ల స్కూల్స్ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు.. తల్లి దండ్రులు ఇద్దరు దవాఖానకు వెళ్ళే క్రమంలో పెద్ద కొడుకు దగ్గరే చిన్న కొడుకును కూడా వదిలేసి ఇంటికి బయట నుంచి తాళం వేసుకొని వెళ్ళారు.



తమ్ముడితో కలిసి అడుకున్న పెద్దకొడుకు మంచానికి, కిటికీకి కలిపి చున్నీతో ఉయ్యాల కట్టాడు. ఉయ్యాలలో ఊగుతుండగా అది వడితిరిగి అతని మెడకు చుట్టుకుంది. ఎంత కష్టపడినా అది రాలేదు.. భయపడిన చిన్న కొడుకు అరిచి కేకలు పెట్టాడు. పక్కింట్లో కూడా ఎవరు లేకపోవడంతో అతడు ఊపిరి ఆడక చనిపోయాడు.రెండు గంటల తర్వాత దవాఖాన నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులకు చున్నీలో చిక్కుకుపోయి మృతి చెందిన కొడుకు కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఇంట్లో ఉయ్యాలలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.. పిల్లలకు తెలియక పోవచ్చు.. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: