ఆంధ్రప్రదేశ్ సర్కార్ అప్పులు చేయడం మాత్రం ఇప్పుడు సంచలనంగా మారింది. భారీగా అప్పులు చేయడంతో రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ తీవ్ర విమర్శలు చేసారు. రాష్ట్ర కాగ్ నివేదికలు చూస్తే జగన్ ఇస్తున్న షాక్ లు ప్రజలకు అర్థమవుతాయని ఆయన అన్నారు. నెలనెలా కాగ్ జగన్ అప్పుల ప్రోగ్రెసివ్ కార్డ్ ను విడుదల చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జగన్ సర్కార్ సెప్టెంబర్ నెలలో రూ.8 వేల 38 కోట్ల భారాన్ని రాష్ట్రంపై మోపారు అని విమర్శించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు మాసాలకే రూ.55 వేల 189 కోట్ల మేర అప్పు చేశారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. వీటిని అంచనా వేస్తే ఈ ఒక్క ఆర్థిక ఏడాదిలోనే ప్రభుత్వ అప్పులు రూ.లక్షా 11 వేల కోట్లకు చేరుకొనే అవకాశం ఉంటుంది అని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఐదేళ్లల్లో రూ.లక్షా 25 వేల కోట్లు అని ఆయన తెలిపారు. ఏడాదికి రూ.25 వేల కోట్లు మాత్రమే టీడీపీ ప్రభుత్వం అప్పు చేసింది అని ఆయన అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఆరు నెలల కాలంలో రెండున్నర రేట్లకుపైగా అప్పులు చేసింది అని ఆయన విమర్శించారు.

జగన్ చేతకానితనంతోనే రాష్ట్ర ఆర్థిక లోటు ఏడాదిలోనే మూడు రెట్లకు పెంచారు అని ఆయన మండిపడ్డారు. జగన్ అధికారం చేపట్టిన నాట్నుంచి ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారు అని ఆయన విమర్శించారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి తెచ్చిన సొమ్మంతా అవినీతికే ఆవిరైపోతుంది అని ఆయన విమర్శలు చేసారు. అప్పుల జాబితాను ఆయన విడుదల చేసారు. ఈ సందర్భంగా  ఆయన అన్ని వివరాలను మీడియా ముందు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: