ఈ రోజుల్లో  సర్కారు నౌకరీ దొరకాలంటే సులువైన విషయం కాదు. ఎన్ని  కోచింగ్‌  సెంటర్లో డబ్బు కట్టి కోచింగ్ తీసుకున్నా ఉద్యోగం దొరికే పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు. దీనిలో పోలీసు నౌకరీ అంటే మరీ కష్టం అనే అనాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా తప్పక ఉండాలి. అలానే  ఫిట్‌నెస్‌, ప్రిపరేషన్‌ కూడా తప్పక ఉండాలి. అయితే ఈ ఉద్యోగం కనుక కావాలనుకుంటే రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ చక్కటి అవకాశం కల్పిస్తోంది. మరి ఇప్పుడే వివరాలని చూసేయండి.

యువతకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది ప్రభుత్వం. ఇప్పటికే ఆ శాఖ అధికారులు ఉమ్మడి వరంగల్‌లోని వరంగల్‌ అర్బన్‌, జనగాం, భూపాలపల్లి జిల్లాల్లో కోచింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసి.... ఏకంగా  3300 మందికి శిక్షణ ఇవ్వనుంది.  ఈ ఉచిత శిక్షణలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యమివ్వనున్నారు. ఇది ఇలా ఉండగా ఎత్తు, శారీరక దృఢత్వం, పరుగుపందెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌ తదితర పరీక్షల్లో రాణించాల్సి ఉంటుంది. జిల్లా నుంచి ఇప్పటి వరకు 96 మంది దరఖాస్తు చేసుకున్నట్లు జిల్లా ఇంటర్మీయెట్‌ విద్యాశాఖ అధికారి గోపాల్‌ తెలిపారు.

ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణత సాధించిన వారు లేకుంటే సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులు ఉచిత కోచింగ్‌ తీసుకోవచ్చు. వీరికి వరంగల్‌ అర్బన్‌ జిల్లా నుంచి హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కోచింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోలీసు ఉద్యోగ నియామకాల భర్తీలో తొలివిడుతగా నిర్వహించే ప్రిలిమినరీ టెస్ట్‌ సిలబస్‌పై హన్మకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అక్కడ అర్హత సాధించిన వారు ఫిజికల్‌ టెస్టు లలో   రాణించడానికి ట్రైనర్‌తో గ్రౌండ్‌లో శిక్షణ ఇస్తారు.  ఫైనల్‌ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్‌పై ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.  మొత్తం నాలుగు నెలల పాటు కోచింగ్  ఉంటుంది. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ఫిజికల్‌ టెస్ట్‌లు, ఆ తర్వాత క్లాస్‌లు ఉంటాయి. ఈ విధంగా ట్రైనింగ్ ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: