ఐరోపా దేశాల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా సెకండ్ వేవ్ భార‌త్‌లోనూ మొద‌లైందా..? ప పెరుగుతున్న కేసుల సంఖ్య అందుకు సంకేత‌మేనా..?  అంటే ఆరోగ్య నిపుణుల నుంచి అవున‌నే స‌మాధానాలు వ‌స్తున్నాయి. క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్‌, మ‌హ‌రాష్ట్ర‌, ఢిల్లీ రాష్ట్రాల్లో వ‌రుస‌గా పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే క్రియాశీల‌క కేసులు కూడా త‌గ్గుముఖం ప‌డుతుండ‌టం ఉన్నంత‌లో ఆశాజ‌న‌క‌మైన విష‌యమ‌నే చెప్పాలి.   భారత్‎లో తాజాగా గత 24 గంటల్లో 48,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 551 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 81,37,119కు చేరింది. 1,21,641 మంది మరణించారు.



ప్రస్తుతం యాక్టివ్ గా 5,52,649 కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 74,32,829 మంది డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.గ‌త మూడు రోజులుగా నిత్యం 40 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం 59,454 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 74,32,829 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య  5,82,649గా ఉంది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 91.34 శాతంగానూ.. నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 7.16 శాతంగా ఉంది. మరణాల రేటు 1.49 శాతానికి తగ్గింది.



ఇదిలా ఉండ‌గా తెలంగాణలో కొత్తగా 1,445 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,486 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,38,632 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,18,887 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,336 కి చేరింది. ప్రస్తుతం 18,409 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,439 మంది హోంక్వారంటైన్ లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 286 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 107 కేసులు నిర్ధారణ అయ్యాయి.  శ‌నివారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: