గత కొన్ని రోజుల నుంచి వరుసగా టెలికాం ఆపరేటర్లు టార్గెట్ చార్జీలు పెంచుతూ మొబైల్ వినియోగదారులందరికీ భారీ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో అతి తక్కువ ధరకే వచ్చిన మొబైల్ టారిఫ్ లు  ఇప్పుడు మాత్రం భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. కదాకాగా భారీగా పెరిగిపోయిన టారిఫ్ రేట్లతో ఇటు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లో మొబైల్ వినియోగదారులందరికీ భారీ షాక్ తగులుతుందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే టెలికాం రంగ ఆపరేటర్లు అందరూ టారిఫ్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.




 ఇక ఇప్పటికే భారీగా పెరిగిన టారిఫ్ రేట్లతో వినియోగదారులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా టారిఫ్ రేట్లు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతం టాక్  వినిపిస్తున్న నేపథ్యంలో మొబైల్ వినియోగదారులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని టెలికాం రంగ ఆపరేటర్లు అందరూ రేట్లను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల వోడాఫోన్ ఐడియా తమ టారిఫ్ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకొని వినియోగదారులందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.



 త్వరలో  వొడాఫోన్ ఐడియా టారిఫ్ రేట్లు పెంచనున్నట్లు సంస్థ సీఈవో రవీందర్ టక్కర్ తెలిపారు. ప్రస్తుతం టారిఫ్ చార్జీలు పెంచుతున్నందుకు ఎలాంటి నిస్సిగ్గుగా లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఇక రానున్న  రోజుల్లో మిగితా టెలికాం రంగ సంస్థలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ప్రస్తుతం ఉన్న టారిఫ్ ఛార్జీలతో టెలికాం రంగ సంస్థలు కొనసాగడం ఎంతో కష్టతరంగా మారింది అని ఎయిర్టెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొబైల్ వినియోగదారులందరికీ భారీ షాక్ తగల పోతుంది అన్నది అర్ధమవుతుంది. ఇప్పటికే భారీ రేంజ్ లో టారిఫ్ చార్జీలు పెరిగాయి ఇక రానున్న రోజుల్లో ఇంకా ఏ రేంజ్లో పెరుగుతాయో అని అటు  మొబైల్ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: