సిద్దిపేట జిల్లా  దుబ్బాక ఉప ఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత కు మద్దతుగా రాయపోల్ మండలం ఎల్కల్, వడ్డేపల్లి, రామసాగర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. హరీష్ రావు మాట్లాడుతూ... ఓటు మీది... మాట నాది.. మూడు ఈ రోజులు మీరు కష్టపడంది.. ఆపై మూడేళ్లు మీ సేవ చేస్తా అంటూ ఆయన హామీ ఇచ్చారు. సీసాలు, పైసలు ఇచ్చేటోళ్లకు ఓట్లు.. ఓట్లు వేయొద్దు అంటూ ఆయన సూచించారు.

మేము పైసలు, సీసాలు ఇచ్చే వాళ్లం కాదు.. పని చేసి ఓట్లు అడుగుతాం.. చేసే పనులు చెబుతం అన్నారు. జాటా పార్టీలను నమ్మొద్దు అని ఆయన సూచించారు. నిజాం కాలంలో భూములున్న రైతుల నుంచి సర్కారీ రకం పేరిట శిస్తులు వసూలు చేసేవారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూమి శిస్తూ, నీటి తీరువా పేరుతో వసూలు చేశారు అని ఆయన మండిపడ్డారు. ఒక్క టిఆర్ఎస్ మాత్రమే భూములున్న రైతులకు ఏటా 10 వేలు పట్టుబడి సాయం ఇస్తున్నది అని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు రైతులకు పది రూపాయలు ఇచ్చారా ? అని ఆయన ప్రశ్నించారు.

గత పాలకుల కాలంలో బోరు పొక్కలల్ల బతుకులు ఆగం అయితుందే అని ఆయన విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడుగుతారన్నారు.   ఈ రోజు కాళేశ్వరం  నీళ్ల గలగలలు చూస్తున్నామా ? లేదా ? అని ఆయన ప్రశ్నించారు. కరోనా వస్తే కార్డు మీద 1500, 12కిలోల బియ్యం ఇచ్చామన్నారు. కాంగ్రెస్, బిజేపీ వాళ్ళు పైసలిస్తాము, సిసలిస్తాము ఓట్లు వేయమంటున్నారు. అని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఆలోచించాలి.. పైసలు, సీసాలు ఇస్తే బతుకుతమా ? పంట పండితే బతుకుతామా ? అని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: