తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే కొన్ని కొన్ని ఇబ్బందులు మాత్రం ఆ పార్టీని చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. రాజకీయంగా ముఖ్యంగా కొంతమంది నేతలు ప్రవర్తిస్తున్న తీరుతో కాంగ్రెస్ అధిష్టానం కూడా చాలావరకు ఇబ్బంది పడుతోంది. పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు రాకపోవడం ఒక కారణమైతే, మరికొంతమంది నేతలు ఏకంగా అసలు పార్టీలో నియోజకవర్గాలను పట్టించుకోవడమే మానేశారు. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది.

ఉమ్మడి జిల్లా ఎలక్షన్లు నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి. దాదాపుగా జనవరి లేదా డిసెంబర్లో ఎన్నికల నిర్వహణ అనేది ఉంటుంది. అయితే ఎన్నికల నిర్వహణ విషయంలో కొంతమంది నేతలు అసలు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. అసలు కనీసం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఓట్లు అసలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా కాంగ్రెస్ నేతలకు తెలియదు. ఓట్లు నమోదు చేయించే ప్రక్రియ విషయంలో కూడా కాంగ్రెస్ నేతలు ముందుకు అడుగు వేయడం లేదు.

దీనిపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలలో అసహనం వ్యక్తం అవుతుంది. చాలా మంది కార్యకర్తలు డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్ల నుంచి ఖాళీగానే ఉంటున్నారు. వారికి అసలు ఓటు ఉందా లేదా అనేది కూడా కాంగ్రెస్ నేతలు పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. పార్టీ కోసం పని చేసిన వారికి కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనితో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పుడు కొంతమంది నేతలపై సీరియస్ గా ఉంది. ఇటీవల రాష్ట్ర పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన మాణిక్యం ఠాగూర్ కూడా దాదాపుగా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన కూడా ముందు హడావుడి చేసినా సరే ఆ తర్వాత దాదాపుగా సైలెంట్ అయ్యారు అంటున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే విధంగా వ్యవహరించడంతో తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తల్లో అసహనం అనేది వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: