జగన్ ఇపుడు చాలా పెద్ద చిక్కుల్లో పడిపోయారు. అసలే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. దానికి తోడు ఇపుడు పోలవరం అతి పెద్ద గుదిబండలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం అన్నది ఆంధ్రులకు జీవనాడి మాత్రమే కాదు, సెంటిమెంట్ కూడా. దాదాపుగా తొమ్మిది జిల్లాలకు  ప్రాణ ప్రదాయిని. అటువంటి బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ విషయంలో తేడా వస్తే ఏపీ జనం మామూలుగా రెచ్చిపోరు. పూనకాలే వస్తాయి. ప్రత్యేక హోదా లేదంటే సరేనని అనుకున్నారు కానీ ఇపుడు ఏకంగా పోలవరానికే టెండర్ పెడితే అసలు ఊరుకోరు.

మరి దీనికి విరుగుడుగా జగన్ చేయాల్సింది ఏంటి. అసలు జగన్ ఏం చేయాలనుకుంటున్నారు. కేంద్రం 20 వేల కోట్లకు ఒక్క పైసా అదనంగా ఇచ్చేది లేదు అన్న తరువాత మరో 30 వేల కోట్ల అదనపు భారం నెత్తిన పడితే భరించేందుకు ఏపీ సిద్ధంగా ఉందా అంటే జవాబు లేదు. ఒక విధంగా పోలవరం పూర్తి కావడం అంటే గగనమే అని కూడా చెప్పాలి. మరి అలాంటి పోలవరం పూర్తి కావాలంటే కేంద్ర పెద్దల చేతిలోనే ఉంది.

వారిని ప్రసన్నం చేసుకోవాలంటే జగన్ ఏం చేయాలి. ఏం చేస్తే వారు శాంతిస్తారు. అంటే దానికి ఒకటే మార్గం ఉందని అంటున్నారు. 22 మంది ఎంపీలు కలిగిన వైసీపీ కేంద్ర సర్కార్ లో అర్జంటుగా చేరడమే ఇపుడు ఉత్తమైన మార్గం అని చెబుతున్నారు. అదే కనుక చేస్తే కేంద్రంలో కీలక భాగస్వామిగా వైసీపీ ఉంటుంది. అలా బలమైన పార్టీగా కేంద్రంలో ఉంటూ పోలవరం సహా ఏపీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలను చకచకా పూర్తి చేసుకోవచ్చు.

అయితే ఇక్కడ రాజకీయంగా చూస్తే బీజేపీ అంటే పడని శక్తులకు జగన్ వైసీపీ కూడా వ్యతిరేకం కావాల్సిఉంటుంది. రాజకీయంగా జగన్ భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కానీ పోలవరం పరంగా చూస్తే జగన్ కొత్త  చరిత్ర సృష్టించేందుకు వీలు అవుతుంది. అందువల్ల జగన్ ఈ విషయంలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగడమే ఉత్తమమ‌ని సూచనలు అందుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: