చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయిపూర్ నగరంలో చోటు చేసుకున్న ఒక సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. బలోడ్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్.. రెండేళ్ల చిన్నారిని సిగరెట్టుతో కాల్చాడు. తన తండ్రి అని పిలవాలని బలవంతం చేశాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పోలీస్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకున్నారు. విధుల నుండి వెంటనే తొలగించి ఆ కానిస్టేబుల్ ని అదుపులోకి తీసుకున్నారు. చత్తీస్గడ్ డీజీపీ మాట్లాడుతూ.. దారుణమైన చర్యలకు పాల్పడ్డ కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


పూర్తి వివరాలు తెలుసుకుంటే అభినాష్ రాయ్ పేరు గల ఓ కానిస్టేబుల్ రెండేళ్ల చిన్నారిని సిగరెట్ తో కాల్చాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఎస్పి జితేంద్ర మీనా మాట్లాడుతూ కానిస్టేబుల్ ని అరెస్ట్ చేశామని వెల్లడించారు. డిజిపి సూచనల మేరకు కానిస్టేబుల్ ని శాశ్వతంగా విధుల నుండి తొలగించేందుకు ఓ ప్రక్రియ స్టార్ట్ చేసామని ఎస్పి జితేంద్ర మీనా మీడియాకి తెలిపారు. ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్న కానిస్టేబుల్ గురువారం రాత్రి.. తన ఇంటి సమీపంలో నివసిస్తున్న ఒక మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆ మహిళ యొక్క కూతురిని బయటకు పిలిచి నాన్న అని పిలవాలని బలవంతం చేసాడు. కానీ ఆ పాప అందుకు తిరస్కరించి గట్టిగా ఏడ్చింది. దీంతో పాపపై ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు కానిస్టేబుల్ తిరిగి డ్యూటీ కి వెళ్ళిపోయాడు.


మరలా శుక్రవారం సాయంత్రం అదే మహిళా ఇంటికి వెళ్లి.. రెండేళ్ల పాప ని బయటికి పిలిచాడు. మళ్లీ నాన్న అని పిలవాలని బలవంతం చేసాడు కానీ ఆ చిన్నారి మళ్లీ తిరస్కరించింది. దీంతో బాగా కోపం తెచ్చుకున్న సదరు కానిస్టేబుల్ నిప్పు వెలిగించిన సిగరెట్ ముక్కతో బాలిక చర్మంపై కాల్చాడు. దీంతో ఆ బాధ తట్టుకోలేని ఆ చిన్నారి గట్టిగా కేకలు పెడుతూ ఏడ్చింది. ఈలోగా బాలిక తల్లి బయటికి వచ్చి చూడగా పోలీస్ కానిస్టేబుల్ నిర్వాహం బయటపడింది. ఒక్కసారిగా ఉలిక్కి పడిన సదరు తల్లి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసింది. బాధ్యతగల పదవిలో ఉండి సామాన్యులను వేధిస్తున్న కానిస్టేబుల్ పై ఉన్నత పోలీసు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల బాలికపై కిరాతకంగా ప్రవర్తించి నాకు మేము సైతం వెంటనే సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని డీజీపీ వద్దకు వెళ్లగా.. ఆయన కానిస్టేబుల్ని విధుల నుండి తొలగించాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: