తెలంగాణ రైతులు దేశంలో అగ్రగామిగా నిలవాలి. రైతులంతా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలంగాణా సిఎం కేసీఆర్ అన్నారు. జనగామ జిల్లా కొడకండ్లలో రైతు వేదికలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామని సిఎం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని చెప్పారు. అమెరికా, యూరప్‌లో కూడా రైతులు నిరసనలు తెలియజేస్తూనే ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అంటూ  లేదని ఆయన తెలిపారు.

రైతు వేదికలు నా కల అని ఆయన అన్నారు. ఈ వేదికలు రైతులను సంఘటిత శక్తిగా మారుస్తాయన్నారు. త్వరలోనే భూ సమగ్ర సర్వే జరుగుతుందని పేర్కొన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే రైతు రాజ్యం వచ్చి తీరుతుందన్నారు. ధాన్యానికి ఎక్కువ ధర ఇస్తామంటే వడ్లు తీసుకోమంటే బంద్ చేస్తారని, ఇతర దేశాల్లో ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తాయని అన్నారు. మన దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తామంటే ఇవ్వనీయరు అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన సూచించారు.

రైతులు కూర్చుని మాట్లాడుకోడానికి ఒక వేదిక లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయట్లేదన్నారు. ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. కరోనా పీడ ఇంకా పోలేదు.. జాగ్రత్తగా ఉండాలన్నారు. రైతు వేదిక ఒక ఆటం బాంబ్‌ అన్నారు. పెన్షన్ల విషయంలో తాను చెప్పేది తప్పయితే రాజీనామాకు సిద్ధమని ఆయన ప్రకటన చేసారు. 38 లక్షల 64 వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తుంటే.. కేంద్రం కేవలం 7 లక్షల మందికి రూ.200 మాత్రమే ఇస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: