సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కిసాన్ అధికార్ దివాస్ సత్యాగ్రహ ఉపవాస దీక్ష చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,వి.హనుమంత రావు, జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి పాల్గొన్నారు. ఇందిరా గాంధీనీ సొంత బాడీ గార్డ్ లు హత్య చేశారు అని ఆన్నారు. భారత దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి ఆపరేషన్ బ్లు స్టాట్ చేసినపుడు నేను కూడా సైన్యం లో ఉన్న అన్నారు.

నాతో సైన్యంలో పోరాడిన చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు అని ఆయన గుర్తు చేసుకున్నారు. నెహ్రూ గాంధీ కుటుంబం  చేసిన అనేక త్యాగాలు దేశ చరిత్రలో ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చేసిన త్యాగాలు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిందన్నారు. 1971 లో పాకిస్తాన్ ని ఓడించి వారి శక్తిని తగ్గించారు అని ఆయన పేర్కొన్నారు. భారత దేశము ఆహార ధాన్యాలు ఎగుమతి లో దేశంలో 5 వ స్థానములో నిలిచిందంటే ఇందిరాగాంధీ ఘనతే అని ఆయన పేర్కొన్నారు. బ్యాంకులను జాతీయకరణ చేసి అనగారిన వర్గాలకు  బ్యాంకింగ్ సౌకర్యం కల్పించారు ఇందిరాగాంధీ అని కొనియాడారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి అనేక సేవలు అందించారన్నారు. మోడీ రైతు వ్యతిరేక చట్టాలు చేస్తున్నారు అని, కెసిఆర్ రైతు వ్యతిరేక చట్టాలను ఎందుకు వ్యతిరేకించడం లేదు అంటే మోసపూరిత విధానానికి ఇది నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కచ్చితంగా గెలుస్తున్నాడని అయన ధీమా వ్యక్తం చేసారు. ముత్యం రెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉండి దుబ్బాక ను   అభివృద్ధి చేశారన్నారు. బీజేపీ నేత కమలాకర్ రెడ్డి ఒక రేపిస్ట్ కి టికెట్ ఎలా ఇస్తారని మాట్లాడిన మాటలే ప్రజలకు మేము వివరిస్తున్నాం అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: