పోలవరం ప్రాజెక్ట్‌ గురించి సాగునీరు, జల వనరుల శాఖ మంత్రి అయినటువంటి అనిల్‌ కుమార్‌ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పోలవరం ప్రాజెక్ట్‌ కట్టాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మంత్రి అనిల్‌ కుమార్‌ ఈరోజు విజయవాడలో ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాగా.. ‘పోలవరం విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

అనిల్ ఈ సందర్భంగా అనేక విషయాలను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని కేవలం కేంద్రమే చూసుకోవాలని ఉందని అన్నారు. "అలాగే భూ సేకరణ, ఇరిగేషన్‌, పునరావాసానికి కేంద్రం ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి. ఇక పోలవరంపై కొన్ని పత్రికలు ఏవేవో రాస్తున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరానికి జరిగిన అన్యాయంపై మాత్రం సదరు సో కాల్డ్ పత్రికలు మాత్రం మాట్లాడలేదు." అని మండిపడ్డారు.

"అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్ర ప్రాజెక్ట్‌గా 2014లో చేపట్టిన సంగతి అందరికీ తెలిసినదే. ఆ తర్వాత ప్రభుత్వంలో వున్న చంద్రబాబు కూడా మూడేళ్లు వరకూ అసలు పోలవరాన్ని పట్టించుకోలేదు. 6 సమావేశాల్లో రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ అడిగినా, చంద్రబాబు సర్కార్‌ మాత్రం సమాధానం ఇవ్వలేదు. 2015 మార్చి నుంచి వారు కేవలం టైం పాస్ చేసారు. 2016 లో ప్యాకేజి ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ కి నిదులు ఇస్తాం అని కేంద్రం చెప్పింది. ఇక వాటి సంగతి గురించి చెప్పనవసరం లేదు. అందరికీ తెలిసినదే!" అని ఎద్దేవా చేసారు.

ఇటువంటి భయంకరమైన తప్పిదాలు చేసిన కేంద్రం, టీడీపీ లు నేడు మమ్మల్ని విమర్శించే స్థాయికి చేరుకున్నారు. చంద్రబాబు చేసిన తప్పు వల్లే ఈ రోజు పోలవరం ఓ సమస్యగా మారింది అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు దాన్ని సవరించడానికే మా సీఎం జగన్‌ ప్రధానికి లేఖ రాశారు అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రాజెక్ట్‌, పునరావాసం రెండింటికి కేంద్రమే పూర్తిగా నిధులివ్వాలి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: