ఆంధ్ర ప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం చేసే సహాయం విషయంలో చాలామంది ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో వైరస్ దెబ్బకు ఆర్థికంగా చాలా నష్టపోయిన పరిస్థితి మనం చూశాం. ఇప్పట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశాలు ఏ మాత్రం కనబడడం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక రాజకీయంగా కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని పరిణామాలు సీఎం జగన్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు రావాల్సిన అవసరం ఉంది.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎప్పుడు రాష్ట్రానికి నిధులు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రధానంగా కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో సీఎం జగన్ సహా రాష్ట్ర ప్రజలు కూడా బాగానే ఇబ్బంది పడుతున్నారు. పోలవరం నిధులు ఇవ్వకపోతే ఇంకా ఖర్చు పెరిగే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం త్వరగా స్పందించి రాష్ట్రానికి సహాయం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 ఇక ఇది కేంద్ర ప్రభుత్వ బృందాలు వరద నష్టాన్ని అంచనా వేయటానికి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వ బృందాలు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల రెండో వారంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ త్వరలోనే ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు అనేది చాలా అవసరం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసే విధంగా బాధ్యత తీసుకుంటున్నట్టు ప్రకటించే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: