ఇస్లాం మత పవిత్ర స్థలం అయినటువంటి మక్కా మసీదులోకి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లడం ఇపుడు పెను సంచలనంగా మారింది. ఇక సదరు వ్యక్తి మతి స్థిమితం సరిగా లేదని మసీదు వద్ద వున్న భద్రతా బలగాలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సౌదీ అరేబియా పోలీసు అధికారులు కూడా ధ్రువీకరించారు. వివరాలిలా వున్నాయి.. నిన్న శుక్రవారం నాడు మధ్యాహ్నం మసీదు దక్షిణ ద్వారాలలో ఒకదానిని ఢీకొట్టి లోనికి కారుతోపాటు వెళ్లేందుకు యత్నించగా గార్డులు పట్టుకున్నారు.

బయట ఉన్న 3 బారికేడ్లను సదరు దుండగుడు అధిగమించగా.. అక్కడే ఉన్న గార్డ్లులు అప్రమత్తమై అతడిని వెంబడించి నిలువరించినట్లు తెలుస్తోంది. అయితే కారుతో మక్కాలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తి పేరుగానీ, ఆయన ఎక్కడి వాడనిగానీ సౌదీ అధికారులు తెలపకపోవడం గమనార్హం. కాగా అతగాడు పూర్తిగా తాగి మతి స్థిమితం లేకుండా వున్నాడని మాత్రం తెలిపారు.

ఇకపోతే, తదుపరి విచారణ కొరకు అతడిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కార్యాలయానికి పంపించామని పేర్కొన్నారు. లాక్ డౌన్ కారణంతో మూతపడిన పవిత్ర మక్కా మసీదు.. దాదాపు 7 నెలల అనంతరం ఈ నెలలో ఓపెన్ అయిందనే విషయం తెలిసినదే. కాగా.. ఇటీవల కరోనా వైరస్ అడ్డంకులను సడలించడంతో 15 వేల మంది ఆరాధకులకు వసతి కల్పించడానికి ఉమ్రా తీర్థయాత్రను విస్తరించగా కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఉమ్రా తీర్థయాత్ర మార్చిలో నిలిపివేశారు.

కాగా.. ఉమ్రాపై పరిమితిని ఆదివారం నుంచి 15 వెళ్లనుంది 20 వేలకు పెంచనున్నారు. విదేశాల నుంచి కూడా యాత్రికులను అధికారులు తాజాగా అనుమతిస్తున్నారు. చరిత్రలో తొలి సారిగా అతి తక్కువ మందితో హాజ్‌ తీర్థయాత్రను సౌదీ అరేబియా ఇటీవల నిర్వహించింది. గత ఏడాది దాదాపు 2.5 లక్షల మంది యాత్రికులు మక్కాను దర్శించుకోగా.. ఈసారి కేవలం 10 వేల మంది దేశ పౌరులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: