దుబ్బాక ఉప ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ప్రచారం కాస్త హాట్ హాట్ గా నడుశుంది. ఈ ఎన్నికల ప్రచారం విషయంలో ఇప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి దాదాపుగా అన్ని పార్టీలు కూడా. ఇక ఇదిలా ఉంటే తాజాగా మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో కీలకంగా పాల్గొంటున్నారు. సిద్దిపేట జిల్లా నార్సింగ్ మండల కేంద్రం లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం, భారీ రోడ్ షో, బహిరంగ సభలో  హాజరైన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, దుబ్బాక టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత తీవ్ర విమర్శలు చేసారు.

వచ్చే మూడేళ్లు టిఆర్ఎస్ అధికారంలో ఉంటది.. టీఆరెస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతది అని ఆయన స్పష్టం చేసారు. ఆసరా పెన్షన్లలో తెలంగాణ ఇచ్చింది 30423 కోట్లు, 1147 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇది కాగ్ రిపోర్ట్ అని ఆయన వివరించారు. కేసీఆర్ సముద్రమంత ఇస్తే.. కేంద్రం ఇచ్చింది కాకి రెట్టంత అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులు 11,180 కోట్లు ఇవ్వకుంటా సతాయిస్తున్నరు అని ఆయన విమర్శలు చేసారు. ఇవ్వాల్సినవి ఇవ్వరు.. ఇవ్వనివి ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు

టిఆర్ఎస్ అభ్యర్థి సుజాత కూడా మాట్లాడారు. లీడర్ అంటే ప్రజల్లో ఉండాలి.. లేదంటే పాడే మీద ఉండాలని రామలింగారెడ్డి ఎప్పుడూ అనే వారు అని ఆమె చెప్పుకొచ్చారు. ఆయన చివరి వరకు ప్రజల్లోనే ఉండి ప్రజలకు సేవ చేశారు అని ఆమె చెప్పుకొచ్చారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకు, అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటా అన్నారు. మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో దుబ్బాకను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గంలో చాలా మంచి స్పందన వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: