ఇపుడు దేశంలో ఎక్కడ చూసినా లవ్‌ జిహాద్ పేరే వినిపిస్తోంది. ఇకపోతే దాన్ని అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పూనుకున్నాడనే విషయం అందరికీ తెలిసినదే. ఈ క్రమంలో ఆయన‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికోసం తమ ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురానున్నదని తాజాగా ప్రకటించారు. వివాహానికి మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు చెప్పిన ఒక రోజు తర్వాత.. యోగి కొత్త చట్టం ప్రకటన ఇపుడు ప్రాధాన్యత సంతరించుకున్నది.

హిందూ మహిళల ఆత్మాభిమానంతో ఆడుకునేవారు ఇకపై తమ ఆలోచనలకు స్వస్తి పలకాలని సూచించారు. అలా కుదరనిపక్షంలో వారి 'రామ్ నామ్ సత్య' ప్రయాణం ఆరంభం అవుతుందని, తగిన బుద్ధి చెబుతుందని యోగి హెచ్చరించారు. కేవలం వివాహ ప్రయోజనం కోసం మతం మార్చడం చట్ట బద్ధం కాదని, అది అత్యంత దారుణమైన చర్య అని అలహాబాద్ హైకోర్టు శుక్రవారంనాడు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా.. రెండు వేర్వేరు మతాల అభ్యర్ధనను కొట్టివేస్తూ.. వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుకావాలని తాజాగా ఆదేశించింది.

ఇకపోతే నూర్జహాన్‌ బేగం కేసులో ఖురాన్‌ హదీసుల ప్రస్తావన తెచ్చిన కోర్టు.. నమ్మకం లేకుండా మతాన్ని మార్చలేమని చెప్పుకొచ్చింది. కాగా.. నికితా తోమర్ దారుణ హత్య తర్వాత 'లవ్ జిహాద్' పై చర్చ తీవ్రతరం అయింది. నిందితుడు తౌసెఫ్.. ఆమెను ఇస్లాం మతంలోకి మారమని ఒత్తిడి చేస్తున్నట్లుగా ఆరోపణలు అనేకం వున్నాయి.

ఈ నేపథ్యంలో సదరు యువతి తల్లిదండ్రులు చాలా ఉద్వేగంగా మాట్లాడారు. తనతో స్నేహం చేసుకోవటానికి అవరోధంగా నిలిచినందున తన గుర్తింపు గురించి అతడు నికితా తోమర్‌కు పూర్తిగా అబద్ధాలు చెప్పాడని ఫిర్యాదులో యువతి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఈ క్రమంలో లవ్‌ జిహాద్, మత మార్పిడులు, హిందువులపై దారుణ సంఘటనలపై వీహెచ్‌పీ తీవ్ర స్థాయిలో మండిపడింది. లవ్ జిహాద్ పేరుతో జరుగుతున్న మత మార్పిడులకు వ్యతిరేకంగా సమర్థమైన చట్టాన్ని తీసుకురావాలని వీహెచ్‌పీ తాజాగా డిమాండ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: