సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన దగ్గరినుంచి రాష్ట్రంలో బీజేపీ చాలా బలపడింది అని చెప్పొచ్చు.. గత అధ్యక్షుడు కన్నా కంటే ప్రజల్లోకి దూసుకుపోవడంలో సోము వీర్రాజు సఫలమయ్యాడు.. పార్టీ ని ప్రజల్లోకి చొచ్చుకుపొయేలా చేయడంలో అయన హ్యాండ్ చాలా ఉందని చెప్పొచ్చు.. రాష్ట్రంలో జరిగే ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసే విషయంలో టీడీపీ కంటే బీజేపీ పార్టీ నే చాలా ముందు ఉందని ప్రజలు సైతం ఒప్పుకుంటారు..  అయితే బీజేపీ ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలని ఏం కోరుకోవట్లేదని ఆపార్టీ అవలంభిస్తున్న విధానాలను చూస్తే అర్థం అవుతుంది..

మొదట్లో ఉండీ ఉండనట్లే బీజేపీ పార్టీ తన రాజకీయ కార్యకలాపాలు ఏపీలో కొనసాగించేది.. దానికి తోడు అప్పటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ కూడా పెద్ద గా ఎవరికీ తెలియక పోవడంతో , విమర్శలు కూడా ఎక్కువ చేయకపోవడంతో పార్టీ పెద్ద గా లైం లైట్ లోకి రాలేదు.. అప్పుడో ఇప్పుడో జీవీఎల్ నరసింహ రావు లాంటి కొంతమంది నేతలు విమర్శలు చేస్తే ఓహో బీజేపీ పార్టీ ఏపీలో ఉందా అని అనిపించేది.. కానీ ఇప్పుడు పరిష్టితి అలా లేదు.. కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయాల్లో హల్చల్ చేస్తూ బీజేపీ ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత సక్సెస్ అయ్యారు..

ఇక పదవి చేపట్టిన కొన్ని రోజులకే అయన చేస్తున రాజకీయం చూస్తుంటే ఆశ్చర్యం కనిపిస్తుంది.. పార్టీ కి ఎనలేని సేవ చేసి ఇప్పుడు దూరం అయిన, సస్పెండ్ అయిన వారిని మళ్ళీ అక్కున చేర్చుకున్తున్నారు..  కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉ‍న్న సమయంలో బీజేపీ నేత లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్‌ను విధించారు. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేశారు.సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి ఒక్కొక్క‌రిపై వేటు వేసి బ‌య‌టికి పంప‌డ‌మే త‌ప్ప ... చేర్చుకునేది లేద‌నే ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దానికి చెక్ పెట్ట‌డంతో పాటు.. త‌న మార్క్ రాజ‌కీయాలు పార్టీకి తెలిసేలా ల‌క్ష్మీప‌తిరాజాను ఆహ్వానించారు. మరి సోము కొత్త రాజకీయం పార్టీ కి ఎలా ఉపయోగపడుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: