చాలామంది చిన్న తాచుపాము చూశారు అంటే భయంతో వణికి పోతూ ఉంటారు అనే విషయం తెలిసిందే.  రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా పాము  కనిపించింది అంటే చాలు ఇక అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అదే తాచుపాము మన వైపు వస్తుంటే ఇక అక్కడి నుంచి పరుగోపరుగు. అయితే చిన్న త్రాచు  పాముని  చూసి వణికిపోయే ప్రజలు పెద్ద అనకొండను చూశారంటే ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గుండె జారి పోయి ప్రాణం గాల్లో కలిసిపోతుంది.



 అయితే ముఖ్యంగా బ్రెజిల్లో అనకొండలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనే విషయం తెలిసిందే. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్  లో  ఎక్కువగా కొండచిలువ లను పోలి ఉండే భారీ అనకొండ లు  అడవుల్లో సంచరిస్తూ ఉంటాయి. అక్కడ ప్రజలకు కూడా తరచూ ఇలాంటి అనుకొండ లు  తారస పడుతూ ఉంటాయి. ఇక భారీగా అనకొండలను చూడాలనుకున్న వారు ఎక్కువగా జియోగ్రఫీ ఛానళ్లలో చూస్తూ ఆశ్చర్య పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు అనకొండల కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతు నెటిజన్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.



కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ఒక పెద్ద అనకొండ నది దాటుతున్నట్లుగా  ఉన్న వీడియో ప్రస్తుతం  అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 50 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉన్న అనకొండ బ్రెజిల్లోని పింగ్జు  నది దాటుతున్నట్లు  ఈ వీడియోలో కనబడుతుంది. దీంతో బ్రెజిల్లో నిజంగానే ఇంత పెద్ద అనకొండ ఉందా అని అందరూ ఒక్కసారిగా అవుతున్నారు. కానీ ఇదంతా వాస్తవం కాదు అని చివరలో ట్విస్ట్ ఇచ్చింది ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్సైట్. 2018లో వచ్చిన ఈ వీడియోని జూమ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది అని తేల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: