దుబ్బాక లో ఎన్నికల సెగ ఎంతవరకు దారి తీసింది అంటే ఏకంగా కేంద్ర బలగాలు వచ్చి దుబ్బాక లో తిష్ట వేసేంత అక్కడ పరిస్థితి మారిపోయింది.. మొన్నటి దాకా దుబ్బాక లోఎంతో స్పోర్టివ్ గా ఎన్నికల ప్రచారాలు సభలు, ర్యాలీలు జరిగాయి.. అన్ని రాష్ట్రాల్లో జరిగినట్లే ఇక్కడ విమర్శలు, దాడులు జరిగాయి.. అయితే బీజేపీ నేత రఘునందన్ బంధువుల ఇంట్లో సోదాలు, కారులో డబ్బు దొరకడం వంటి పరిణామాలు చూస్తుంటే బీజేపీ కేంద్రాన్ని సహాయం కోరగా వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది..  పోలీస్ అబ్జ‌‌ర్వ‌ర్ గా త‌మిళ‌నాడుకు చెందిన ఐపీఎస్ ఆఫీస‌ర్ ను నియ‌మించింది. పోలింగ్ అబ్జర్వర్లను నియ‌మించాల్సిన చోట‌. పోలీస్ అబ్జర్వర్ను నియమించారు. దీంతో వ‌చ్చే నెల 3న పోలింగ్ జ‌ర‌గ‌బోయే దుబ్బాక ఉప ఎన్నిక‌ దేశ వ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది.

ఇక తెలంగాణాలో సరైన బలం లేకున్నా కూడా ప్రతిపక్షాలు చెప్పే మాటలు చూస్తుంటే తొందరలోనే అధికారంలోకి వచ్చేలా ఉన్నట్లు అనిపిస్తుంది.  గట్టిగా 20 సీట్లు కొట్టలేని పార్టీ సైతం తమ గొంతు చించుకు అరవడం తెలంగాణ ప్రజలకు హాస్యాస్పదం అనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు తో సరిపెట్టుకున్న బీజేపీ, గట్టి పోటీ ఇస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ దుబ్బాక విషయంలో  ఒకింత అత్యుత్సహం ప్రదర్శిస్తుంది.. ఇది అక్కడి ప్రజలకు ఒకింత నవ్వు తెప్పిస్తున్న ఇక్కడ గెలవాలన్న వారి తపన చూస్తుంటే వారికెంతో ముచ్చటేస్తుందట.. ఇంత హడావుడి మొన్నటి ఎన్నికల్లో చూపిస్తే ఎంతో కొంత ప్రజలు వారి వెంట నిలిచే వారు కదా అంటున్నారు..

ఇక దుబ్బాక లో నెలకొన్న పరిస్థితుల రీత్యా అక్కడి కలెక్టర్‌పై బదిలీ వేటు ప‌డింది. అధికార పార్టీ కి సహకరిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్షాలు ఈసీ కి ఫిర్యాదు చేయగా ఆయనను తప్పించి భారతీ హోళికేరికి బాధ్యతలు అప్పగించారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువులు, ఇతరుల ఇండ్లపై పోలీసుల సోదాలు, ఈ సందర్భంగా తలెత్తిన వివాదాలు, లాఠీచార్జ్, అరెస్టులు సంచలనం సృష్టించాయి. ఇక ఇక్కడ గెలిచేందుకు టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సర్వశక్తులు ఒడ్డుతున్నది. రామలింగారెడ్డి భార్య సుజాతను ఆ పార్టీ క్యాండిడేట్గా నిలిపింది. కాంగ్రెస్ తరపున చెరుకు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి  బరిలోకి దిగారు

మరింత సమాచారం తెలుసుకోండి: