భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం నేపథ్యంలో భారత ఆర్మీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇన్ని రోజుల వరకు అభివృద్ధి చేసిన అన్ని రకాల ఆయుధాలను ప్రయోగాలు నిర్వహించి భారత అమ్ములపొదిలో చేరుస్తుంది. ఏ క్షణంలోనైనా యుద్ధం తలెత్తే అవకాశం ఉంది అని భావించిన భారత్.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా చైనాను  చావు దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతో ఎంతో  వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.



భారత ఆర్మీ క్రమ క్రమంగా మరింత పటిష్టంగా చేసుకునేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఎన్నో ఆయుధాలకు  ప్రయోగాలు నిర్వహించి వాటిని భారత వాయుసేనలో  చేర్చేందుకు సిద్ధమైంది. దీంతో భారత ఆర్మీ రోజురోజుకు మరింత పటిష్టంగా మారిపోతున్న విషయం తెలిసిందే. ఇక అంతే కాకుండా ఇప్పటివరకు భారత రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసిన అన్ని ఆయుధాలు కూడా విజయవంతం కావడం ఎంతో సమర్థవంతంగా కచ్చితత్వంతో టార్గెట్ చేధిస్తూ ఉండటం ప్రస్తుతం శుభపరిణామం అని చెప్పాలి.


 అదే సమయంలో అవసరమైన అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను విదేశాలనుంచి కూడా కొనుగోలు చేస్తుంది  భారత్.కాగా  ఇటీవలే భారత రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇకపైన భారత దేశం విదేశాల నుంచి కొనే  ఆయుధాలను తగ్గిస్తూ కేవలం అత్యవసరమైనవి మాత్రమే కొంటుంది అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. కాగా రక్షణ శాఖ స్టేట్మెంట్ వెనుక ఎంతో పదునైన వ్యూహం ఉంది అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే డిఆర్డిఓ దాదాపుగా 10-15 కు  పైగా క్షిపణులను  అభివృద్ధి చేయడమే కాదు ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించింది. ఇలా  అన్ని క్షిపణుల ప్రయోగం నిర్వహించి భారత అమ్ములపొదిలో చేర్చుతూ క్షిపణుల సంఖ్యను పెంచేందుకు భారత రక్షణశాఖ నిర్ణయించిందని.. అందుకే  విదేశీ ఆయుధాలు కొనుగోలు ఆపేయాలని నిర్ణయించిందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: