దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచంలో నే ఏ నగరంలో లేనంత గా రోజు రోజుకు కాలుష్యం పెరిగి పోతోంది అన్న విషయం తెలిసిందే . కొన్ని కొన్ని సమయాల లో అయితే ఏకంగా కనీసం మనుషులు గాలి  పీల్చుకోవడాని కి కూడా అనువైనది   గాలి  రాష్ట్ర వ్యాప్తంగా లేని విధంగా మారిపోతూ ఉంటుంది పరిస్థితి. ఇలాంటి సమయాల లో ఏకంగా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరి నీ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉంటాయి. దేశ రాజధాని ఢిల్లీ లో ఎప్పుడు చూసినా శీతాకాలం లో పొగమంచు పట్టుకున్నట్లుగా పూర్తిగా ఢిల్లీలో పొగ  కనిపిస్తూ ఉంటుంది.




 అంటే ఢిల్లీలో కాలుష్యం రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యం లో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ రానున్న నేపథ్యం లో దీపావళి పండుగకి టపాసులు పేల్చ వద్దు అంటూ నిబంధన విధించింది కేజ్రివాల్ ప్రభుత్వం. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా టపాసులు పేలిస్తే ఏకంగా లక్ష రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది అంటూ ప్రభుత్వం నిబంధన విధించడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది.



 అయితే ఢిల్లీలో కాలుష్యం  తగ్గించాలి అన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కానీ ప్రతి సారి కూడా ఇలా హిందూ పండుగలు విషయంలో నిబంధనలు విధించడం మాత్రం సరైనది కాదు అని అది విశ్లేషకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హిందూ పండుగలు వచ్చినప్పుడు మాత్రమే కాలుష్యం గురించి గుర్తొస్తుంది అంటూ విమర్శిస్తున్నారు. కేవలం ఒకే ఒక్క రోజు టపాసులు కాల్చక  పోయినంత మాత్రాన ఢిల్లీలో కాలుష్యం తగ్గదు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకుంటే బాగుంటుంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: