ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతలు ఏది చేసినా సరే తెలుగుదేశం పార్టీ నేతలు ఏదోక రూపంలో విమర్శిస్తూనే ఉన్నారు. రాజకీయంగా ప్రతీ  విషయంలో కూడా తమకు అనుకూలంగా కోణాలు చూస్తూ విమర్శలు చేయడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక తాజాగా ఏపీ హోం మంత్రిని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు టార్గెట్ చేసి విమర్శలు చెసరు. మోడల్ పోలీస్ స్టేషన్స్  హోం మంత్రి ప్రారంభించడం భాధకరం అని ఆయన ఆరోపణలు చేసారు. ఆమె అధికారాల గురించి ఆమెకు తెలియదు అని ఆమె అన్నారు.

లోకల్ మంత్రి, ఎంపి, ఎమ్మెల్యే లేదా  ఎమ్మెల్యే ప్రారంభిస్తే బాగుండేది అని ఆయన హితవు పలికారు. దళిత కుటుంబానికి చెందిన ఆమె...  ఉన్నత స్థానంలో ఉన్నారు అని అన్నారు. దళితులకు ఆన్యాయం జరిగినప్పుడు  ఒక్కసారి కూడ  స్పందించలేదు అని ఆయన నిలదీశారు. మహిళను  పోలీసులు తన్ని, లాటిలతో కొడితే ఎందుకు మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు. అనకాపల్లి,   నర్సీపట్నంలో మోడల్ పోలీసు స్టేషన్ ఎన్నికలు ముందే పూర్తయ్యాయి అని ఆయన పేర్కొన్నారు.

ప్రారంభించడానికి  యేడాదిన్నర పైన పట్టింది అని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రారంభించినందుకు సంతోషం అని ఆయన చెప్పుకొచ్చారు. ఆమరావతీలో  మహిళను  పోలీసులు తన్ని, లాటిలతో కొడితే ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు. దిశ చట్టమే లేదు  పోలీసు స్టేషన్లు ఒపినింగ్ చేసేస్తున్నారు అని ఎద్దేవా చేసారు. గంజాయి నాటు సారాను ఆరికడితే మంచిది అని సూచించారు. దీని వెనుక  ఎవరున్నా పోలీసుల వద్ద రికార్డులు ఉన్నాయి. వివరాలతో బయటపెట్టండి అని ఆయన సవాల్ చేసారు. ఎస్సీల మీద ఎస్సీ చట్టం కింద కేసులు పెట్టడం  ఎక్కడ చూడలేదు. తుగ్లక్ పాలనలోనే చూశాం అన్నారు. ఆరుగురు హెడ్ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు అని... అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: