రాగి పాత్రలను ఎక్కువగా పూర్వ కాలంలో ఉపయోగించేవారు. అంతేకాదు అప్పటి ప్రజలు రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని మాత్రమే తాగేవారు. ఇక ఇప్పటికి కూడా కొంత మంది రాగి పాత్రల్లో నీళ్లు తాగేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసం దుకాణాల్లో అధిక ధరలు చెల్లించి కాపర్ బాటిల్స్ కొంటున్నారు. అయితే రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా పలు అధ్యయనాలు కూడా ఈ విషయాలను ధ్రువీకరించాయి.

ఇప్పుడంటే మనం వాటర్ ప్యూరి ఫయర్స్ ఎక్కువగా వాడుతున్నాము. కానీ పూర్వం అలాంటి సౌకర్యాలు ఉండేవి కాదు. అందుకే రాత్రంతా రాగి పాత్రల్లో నీటిని నిల్వ వుంచే వారు. మరుసటి రోజు ఆ నీటిని తాగేవారు. ఇలా రాగి పాత్రల్లో నీటిని నిల్వచేస్తే అందులోని సూక్ష్మ జీవులు నశించి శుద్ది అవుతుంది. ఇలా చేస్తే శరీరంలోని కఫం, పిత్తం,వాతాలు సమతుల్యంగా ఉంటాయని పూర్వీకులు ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఇంకా ఈ నీటితో శరీరంలోని వివిధ అవయవాల పనితీరు చాలా వరకు మెరుగు పడుతుంది.

ఇక రాగి పాత్రల్లో నీటిని తాగితే కడుపులో మంట తగ్గుతుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. ఇక జీర్ణ వ్యవస్థ, కాలేయం, కిడ్నీల పనితీరు మెరుగు పడేలా చేస్తుంది. ఇక రాగి పాత్రల్లో ఆహారం తీసుకుంటే శరీరానికి పలు రకాల పోషకాలు అందుతాయి. శరీరంలో పేరుకు పోయిన కొవ్వును కరిగించడానికి ఈ నీళ్లు బాగా ఉపయోగపడుతాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఈ నీటిని తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.

అంతేకాదు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాగి ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొత్త కణాల ఉత్పత్తిలో రాగి ప్రముఖ పాత్ర వహిస్తుంది. కడుపులో ఎలాంటి పుండ్లు వున్న వాటిని మాన్పడంలో రాగి దోహదపడుతుంది. వృద్దాప్య ఛాయలు ధరి చేరకుండా రాగి ఉపయోగపడుతుంది. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలని అనుకునేవారు రాగి పాత్రలో నిల్వ వుంచిన నీటిని తాగితే చాలా ప్రయోజనం వుంటుంది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కు కారణమయ్యే కణాలతో పోరాడుతాయని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: