ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సమరం ఇప్పట్లో జరగేలా కనిపించడం లేదు. సీఈసీ నిమ్మగడ్డ చర్యలపై వైసీపీ ఏమంటోంది ? ఎన్నికల నిర్వహణపై  ప్రభుత్వం చెబుతున్నదేంటనే సందేహం.? ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యలే ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పక్షాలన్నీ స్థానిక ఎన్నికలు జరపాలని కోరాయి. రాష్ట్రంలో ఒక్క అధికార పక్షం తప్ప అన్ని పార్టీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. కరోనా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు ఏంటంటూ అధికార పక్షం ప్రశ్నిస్తోంది. అసలు ఇలాంటి సమయంలో రాజకీయ పక్షాలతో సమావేశాన్నే అధికార పార్టీ తప్పు పట్టింది. తాజాగా స్థానిక ఎన్నికలపై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదని కుండబద్దగొట్టారు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌. కొవిడ్‌ ఇంకా అదుపులోకి రాలేదని, అందువల్ల ఎన్నికలు సాధ్యంకాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చెప్పినట్టు ఇక్కడ జరగదని అన్నారు. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం కలిసి సమన్వయంతో  పని చేయాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాలు కుదరవని స్పష్టం చేశారు.

టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రయత్నిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. కరోనా ఎక్కువగా ఉన్న సమయంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారని మండిపడ్డారు. మార్చినెలలో ఒకటి రెండు కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికలు జరపకుండా.. ప్రస్తుతం అధికంగా కేసులు నమోదవుతున్న తరుణంలో జరపాలనడంలో అర్థమేంటో చెప్పాలన్నారు మంత్రి.

ఎన్నికలకు భయపడేది లేదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం...  ప్రజల ఆరోగ్యంతో ఆటలొద్దనేదే తమ ఉద్దేశమని చెబుతోంది. ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించాలని సూచిస్తోంది.మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. అన్ని పార్టీలది ఒక రూట్ అయితే.. అధికార పార్టీది మరో రూట్ గా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: